Aడిసెంబరు 31వ తేదీ తర్వాత రాష్ట్రంలో కృత్రిమ ఉద్యమం సృష్టిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ప్రభుత్వ పాలనా యంత్రాంగాన్ని పూర్తిగా స్తంభింపజేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రాంత ప్రజల ఆక్రోశం, ఆగ్రహాన్ని చవిచూడక ముందే అన్నదమ్ముల్లా విడిపోయేందుకు సీమాంధ్ర నేతలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభాసుపాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాంతంలో కొమరం పులి చిత్రాన్ని విడుదలకు తెలంగాణ విద్యార్థులు డబ్బు డిమాండ్ చేసినట్టు చెపుతున్న చిరంజీవి.. ఆ విధంగా డిమాండ్ చేసిన వారి పేర్లను వెల్లడించాలని ఆయన కోరారు.
ఆరోపణలు చేయడం మాని డబ్బులు డిమాండ్ చేసిన వారి పేర్లను చిరంజీవి బహిర్గతం చేయాలని ఆయన సవాల్ విసిరారు. లేకుంటే చిరంజీవి ముక్కును నేలకు రాసి తెలంగాణ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు.
ఇకపోతే.. తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలపై ఆయన దుమ్మెత్తి పోశారు. తెలంగాణకు అనుకూలమని చెప్పుకుంటున్న తెదేపా తెలంగాణ సీనియర్ నేతలు చంద్రబాబు నాయుడుతో జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నివేదిక ఇప్పించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
మరి సీమాంధ్ర నేతలు కేసీఆర్ వ్యాక్యాల ఫై ఎలా స్పందిస్తారు ???
0 comments:
Post a Comment