Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Wednesday, November 3, 2010

ఏఐసీసీ సమావేశాల కంటే ఓదార్పే ముఖ్యం: జగన్

దేశ రాజధాని హస్తినలో జరుగుతున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశాల కంటే ఓదార్పు యాత్రే తనకు ముఖ్యమన్నట్టుగా కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు సమాచారం. తన తండ్రి దుర్మరణం అనంతరం పావురాలగుట్టపై ప్రజలకు ఇచ్చిన మాట్ను నిలబెట్టుకోవడమే తన ప్రధాన కర్తవ్యంగా భావిస్తున్నట్టు జగన్ వ్యవహరిస్తున్నారు. 

అందుకే.. ప్రతి కాంగ్రెస్ వాది ప్రతిష్టాత్మకంగా భావించే ఏఐసీసీ సమావేశాలకు జగన్ డుమ్మా కొట్టారు. ఈ వ్యవహారశైలిపై పలువురు పెదవి విరుస్తున్నారు. ఏఐసీసీకి గైర్హాజరు కావడం ఆయనలోని నిర్యక్ష్యాన్ని, పార్టీ అంటే లెక్కలేని తనాన్ని సూచిస్తోందన్న జగన్ ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు. పూర్తి తెగింపు ధోరణి, అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు జగన్ ఇలాంటి తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు అంటున్నారు. 

గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఓదార్పు యాత్రను వాయిదా వేసుకుని జగన్ సమావేశాలకు హాజరయ్యారని గుర్తు చేశారు. అయితే, పార్టీ తరపున అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ సమావేశాలకు హాజరుకాకపోవడం ఆయనలోని అహంకారాన్ని మరోమారు బహిర్గతం చేసిందని వారు అంటున్నారు. గతంలో పార్లమెంట్ సమావేశాల సమయంలో విప్‌ జారీ చేయడం వల్ల తప్పనిసరి పరిస్థితిలో వెళ్లవలసి వచ్చిందని ఆయన అనుచర వర్గం వివరణ ఇస్తోంది. 

ఏదే ఏమైనా.. జగన్‌కు పార్టీపై అభిమానం, పార్టీలో కొనసాగాలన్న ఆలోచన ఉన్నట్టయితే ఓదార్పు యాత్రకు ఒకరోజు విరామం ఇచ్చి ఢిల్లీకి వెళ్లి వచ్చి ఉండాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సాగుతున్న నెల్లూరు జిల్లా ఓదార్పు యాత్రలో అనారోగ్యానికి గురికావడంతో యాత్రకు విరామం ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. 

ఇపుడు కూడా ఢిల్లీకి వెళ్లాలన్న చిత్తశుద్ధి, పార్టీలో కొనసాగాలన్న ఆలోచన ఉండివుంటే ఓదార్పు యాత్రకు ఒకరోజు విరామం ఇచ్చి ఉండేవారని, ఆయనకు అలాంటి అభిప్రాయం, పార్టీపై గౌరవం లేనందుకే ఏఐసీసీ సమావేశానికి వెళ్లలేదని విశ్లేషిస్తున్నారు. ఈ వ్యవహారంలో జగన్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోందని అంటున్నారు. 

తాను పార్టీ అధినాయకత్వాన్నైనా ఎదిరిస్తాననే సంకేతాలు పార్టీ యువ కార్యకర్తలకు పంపించే ప్రయత్నంలో భాగమై ఉండవచ్చని వారు అంటున్నారు. అంతేకాకుండా, వైఎస్‌ఆర్ తరహాలోనే అనుకున్నది చేయడానికి జగన్‌ ఎంతకైనా తెగిస్తరని, తండ్రి మాదిరిగా ఎవరినీ లెక్కచేయరన్న ముద్ర వేయించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోందని ఇంకొందరు అంటున్నారు. జగన్ గైర్హాజరీపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీసినట్టు ఏఐసీసీ వర్గాల సమాచారం.

0 comments:

Post a Comment