అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటనపై పాకిస్థాన్ న్యూస్ ఛానళ్లు దృష్టి పెట్టాయి. ఒబామా భారత్ పర్యటన సందర్భంగా చేపట్టే కార్యక్రమాలు, ప్రసంగాలను ప్రధాన పేజీల్లో కవర్ చేస్తున్నాయి.
ప్రధాన వార్తల స్థానంలో ఒబామా భారత్ పర్యటన విశేషాలను పొందుపరుస్తున్నాయి. ఒబామాతో పాటు, ఆయన భార్య మిషెల్లీ ప్రతి కదలికపైనా దృష్టిపెట్టిన పాకిస్థాన్ న్యూస్ ఛానెళ్లు, ఒబామా జనంతో మాట్లాడిన అన్ని కార్యక్రమాలను, చివరికి ఆయన ముంబయి నుంచి ఢిల్లీకి చేరుకున్న సంఘటనను కూడా ప్రత్యక్ష ప్రసారం చేశాయి.
పాకిస్తాన్ ప్రముఖ దినపత్రికల్లో ఒకటయిన ‘డాన్’ భారత్, అమెరికాల మధ్య కుదిరిన వెయ్యి కోట్ల డాలర్ల విలువైన వాణిజ్య ఒప్పందాలకు ప్రాధాన్యత ఇచ్చింది. అలాగే ఒబామా, ఆయన భార్య పాల్గొన్న వివిధ కార్యక్రమాలకు విస్తృత కవరేజి ఇచ్చిన ఆ పత్రికలో ఒబామా వ్యాఖ్యలపై సంపాదకీయం కానీ, వ్యాసాలను కానీ లేక పోవడం విశేషం.
ఒబామా, ఆయన భార్య ముంబయిలో పిల్లలతో ముచ్చటించిన దృశ్యాలు, అలాగే అనాథ శరణాలయం పిల్లలతో కలిసి మిషెల్లే బాలీవుడ్ సినిమా ట్యూన్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేసిన దృశ్యాలకు టీవీ చానళ్లు విస్తృత ప్రచారం ఇచ్చాయి

0 comments:
Post a Comment