: ముఖ్యమంత్రి పదవికి రోశయ్య రాజీనామా చేయడంతో తదుపరి సీఎం ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొనివుంది. శాసనసభ స్పీకర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి గీతారెడ్డి పేర్లు ప్రధానంగా విన్పిస్తున్నాయి. కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి, పల్లంరాజు పేరు కూడా తెరపైకి వచ్చింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన గీతారెడ్డికి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశముందన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఈ సాయంత్రం జరగనున్న సీఎల్పీ సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశముంది. ఈ సమావేశానికి అధిష్టానం తరపున రాష్ర్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ, సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రణబ్ ప్రతిపాదించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
12 years ago
0 comments:
Post a Comment