Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Wednesday, November 24, 2010

14 నెలలు పాలించిన రోశయ్య



హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రోశయ్య 14 నెలల 22 రోజుల పాటు రాష్ట్రాన్ని పాలించారు. అధిష్టానం ఆశీస్సులతో సీఎం పదవిని చేపట్టిన ఆయన బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. పనుల ఒత్తిడి, వయోభారం కారణంగానే సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. రాజకీయాల్లో అపార అనుభమున్న రోశయ్య రాష్ట్రంలో వివిధ పదవులను నిర్వహించారు. రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి హోదాలో అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనకు దక్కింది.

0 comments:

Post a Comment