Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Wednesday, November 3, 2010

తెలంగాణ మాటేమోగానీ.. కలెక్షన్లలో కింగ్: గోనే ధ్వజం

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు కుటుంబంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గోనె ప్రకాశరావు మరోమారు విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కేసీఆర్ కుటుంబం కోట్లకు పడగలెత్తిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటుకు వీరు చెస్తున్న కృషి ఎంతమేరకు ఉందో తెలియదు గానీ, బలవంతపు వసూళ్ళలో మాత్రం కలెక్షన్ల కింగ్‌ ఫ్యామిలీగా మారిందని ఆయన దుయ్యబట్టారు.

ఆయన బుధవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ హింసతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించలేరన్నారు. రాష్ట్రావతరణ వేడుకలను విద్రోహ దినంగా పాటించాలని పిలుపునిచ్చిన కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్‌లు.. నవంబరు ఒకటో తేదీన మాత్రం ఇంటి గడప దాటలేదని ఎద్దేవా చేశారు. 

తెలంగాణ కోసం ఇంత హంగామా, హడావుడి సృష్టిస్తున్న కేసీఆర్.. లక్ష్య సాధన అంశంపై పార్లమెంట్‌లో ఏరోజైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో దాదాపు 500 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకుంటే బతుకమ్మ పండుగను కోటి రూపాయల ఖర్చుతో నిర్వహించిన ఘతన కేసీఆర్ కుమార్తె కవితకే దక్కుతుందన్నారు. 

ఇలాంటివారు బలిదానాలు చేసుకున్న విద్యార్థుల ఆత్మశాంతి కోసం రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించరాదని డిమాండ్ చేయడం ఎంతవరకు సబబని గోనే ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ఏర్పాటుపై కేసీఆర్ అనుసరిస్తున్న ద్వంద వైఖరిని విడనాడి చిత్తశుద్ధితో నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

0 comments:

Post a Comment