ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎంపిక చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. బుధవారం రాజీనామా సమర్పించిన రోశయ్య స్థానంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారు. వాయల్పాడు నియోజకవర్గం నుంచి ఎన్నికైన కిరణ్‌కుమార్‌రెడ్డి 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేసారు. ఆతర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో పీలేరు నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చాక స్పీకర్ పదవిని చేపట్టారు. ఈ సాయంత్రం జరిగిన సీఎల్పీ భేటిలో రాష్ర్ట ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధికి కాంగ్రెస్ పరిశీలకులుఅప్పగించారు. ఆతర్వాత సీఎల్పీ ఏకవాక్య తీర్మానాన్ని సోనియాగాంధీకి పంపించారు. |
0 comments:
Post a Comment