దేశంలో రాజకీయ నేతలపై చెప్పులు విసిరే సంస్కృతి నానాటికీ ఎక్కువ అవుతోంది. ఆమధ్య అగ్రదేశాధ్యక్షుడుగా ఉన్న జార్జిబుష్‌పై ఓ ఇరాకీ జర్నలిస్టు బూటు విసిరి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత కేంద్ర హోం మంత్రి చిదంబరానికి కూడా ఇదే తరహా చేదు అనుభవం ఎదురైంది. ఇపుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వంతు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ద్వంద వైఖరిని అనుసరిస్తున్న బాబుపై.. ఓ తెలంగాణా వాది చెప్పు విసిరి తన నిరసన వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం రంగారెడ్డి పర్యటనలో ఉన్న చంద్రబాబుకు ఈ తరహా చేదు అనుభవం ఎదురైంది. ఈ పర్యటనలో తెలంగాణ వాదనులు బాబును అడుగడుగునా అడ్డుకుంటున్న విషయం తెల్సిందే. బాబు కాన్వాయ్ కూకట్‌పల్లి చౌరస్తా వద్దకు రాగానే తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు, ఇతర తెలంగాణావాదులు ఆయన పర్యటనను అడ్డుకున్నారు.
వీరంతా చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హంగామా సృష్టించారు. వీరిలో ఓ ఆందోళనకారుడు చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పు విసిరి వేశాడు. అయితే, అది పైన పడకుండా పక్కకు తప్పుకున్నారు. అనంతరం పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, మిగిలి వారిని అక్కడ నుంచి చెదరగొట్టారు. చంద్రబాబు మాత్రం విక్టరీ సింబల్ చూపుతూ తన పర్యటనను కొనసాగించాడు.

0 comments:
Post a Comment