Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Monday, November 8, 2010

హమ్మయ్య... "జల్" గండం తప్పిపోయింది..


ప్రజలను భయాందోళనకు గురిచేసిన జల్ గండం తప్పిపోయింది. తమిళనాడు, కోస్తాంధ్ర ప్రజలను భయపెట్టిన జల్ తుపాను అనూహ్యంగా బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. థాయ్‌లాండ్‌లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వాయుగుండంగా, తర్వాత పెను తుపానుగా రూపాంతరం చెంది, తమిళనాడు, నెల్లూరు వైపు దూసుకొచ్చింది. 

కానీ పెను తుపాను తీవ్రత తగ్గించుకుని తుపానుగా మారిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది మరింత బలహీనపడి ఆదివారం అర్థరాత్రి చెన్నై వద్ద జల్ తీరం దాటింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. 

గాలివేగం 120-140 కిలోమీటర్లు ఉంటుందని భావించినా, 50-70 కిలోమీటర్లకే పరిమితం కావడంతో తుపాను గండం గడించింది. ఇప్పటికే చలిగాలులు, నానిన గోడలు కూలిపోవడం నెల్లూరు జిల్లాలో మాత్రం 18 మంది మృతి చెందారు. 

తుపాను ప్రభావం తగ్గుముఖం పడుతోందని ప్రకటించిన ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలుగా నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రాణ, ఆస్థి నష్టాలను నివారించేందుకు గ్రామస్థాయి నుంచి అధికారులను అప్రమత్తం చేసింది. ఇకపోతే తీరం దాటిన వాయుగుండం రాయలసీమ వైపు పయనిస్తుండటంతో సోమవారం నుంచి ఆ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

0 comments:

Post a Comment