Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Wednesday, August 4, 2010

ప్రజాస్వామ్యమా.. కాంగ్రెస్‌లో నీవెక్కడా: అంబటి రాంబాబు

కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందో లేదో తెలియని సందిగ్ధావస్థలో తాము ఉన్నట్టు సస్పెండ్‌కు గురైన పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. ఎవరిని ఎందుకు తీసేస్తున్నారో వివరణ ఇచ్చుకోలేని స్థితిలో పెద్దలు ఉన్నారన్నారు. పార్టీ ప్రజాస్వామ్యం అంటే ఇదేనా ఆయన ప్రశ్నించారు.

ఆయన బుధవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ వామపక్షాల ఖిల్లాగా ఉన్న ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఐదు స్థానాలను అందించిన ఘనత రాజశేఖర రెడ్డికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడంలో తమతో పాటు అనేక మంది పార్టీ కార్యకర్తల సహకారం ఉందని అంబటి చెప్పుకొచ్చారు.

అయితే, ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా, పార్టీ శ్రేణులకు చెడు సంకేతాలను పంపేలా ఉన్నాయన్నారు. తనను సస్సెండ్ చేసినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి.. కానీ తనకు అధికారికంగా ఎలాంటి పత్రాలు అందలేదని గుర్తు చేశారు.

అలాగే, కాంగ్రెస్ అనుబంధ సంస్థ కిసాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి గట్టు రామచంద్రరావును తొలగించినట్టు తాజాగా వార్తలు వచ్చాయి. ఆయనకు కూడా స్పష్టమైన ఆదేశాలు అందలేదన్నారు. ఏది ఏమైనా.. కొంతమంది పెద్దలు అంటే ముఖ్యమంత్రి స్థాయి వంటి నేతల ఒత్తిడి, ప్రోద్భలంతోనే ఈ తరహా చర్యలు చేపడుతున్నారన్నారు.

ఇలాంటి చర్యలు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో మనుగడ సాగించేలా చేస్తాయా, వైఎస్.రాజశేఖర రెడ్డి, వైఎస్.జగన్మోహన్ రెడ్డి పేర్లను ప్రస్తావించకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగగలదా అని ప్రశ్నించారు. వైఎస్ జపం చేయడాన్ని నేరంగా భావించి తమపై కక్ష చేపడుతున్నట్టుగా ఉందన్నారు. ఏది ఏమైనా.. తమకు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత పెద్దలపై ఉందని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డా

0 comments:

Post a Comment