తమ ప్రియతమ నేత దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు, కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం చర్య తీసుకోవడం తథ్యమనే సంకేతాలు ప్రస్ఫుటంగా వస్తున్నాయి. ఇప్పటికే జగన్ వర్గీయులపై చర్యలు చేపట్టిన హైకమాండ్ తదుపరి అస్త్రాన్ని ఏకంగా జగన్‌పైనే ప్రయోగించాలని నిర్ణయించినట్టు ఢిల్లీ వర్గాల సమాచారం.
'ముల్లును ముల్లుతోనే తీయాల'న్న చందంగా కాంగ్రెస్ హైకమాండ్ సంధించే అస్త్రాన్ని ధీటుగా ఎదుర్కునేందుకు జగన్ వర్గం సిద్ధమైంది. ఇందుకోసం మాజీ మంత్రి, శాయంపేట ఎమ్మెల్యే కొండా సురేఖ ఎంచుకున్న లేఖాస్త్రం మార్గానే ఎంచుకోనుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను వివరిస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు లేఖ రాయాలని మరికొంతమంది నేతలు నిర్ణయించారు.
అసెంబ్లీకి తొలిసారి ఎంపికైన యువ ఎమ్మెల్యేలలో సింహ భాగం జగన్ వైపుకు మొగ్గు చూపుతున్నారు. వీరంతా కొండా సురేఖ బాటను ఎంచుకోవాలని తీర్మానించినట్టు సమాచారం. కొంతమంది వృద్ధ నేతలు కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని, వీరికి చెక్ పెట్టి హైకమాండ్ కళ్లు తెరిపించేందుకు ఈ లేఖాస్త్రాలను సంధించాలని వారు నిర్ణయించారు. ఏది ఏమైనా.. కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాలు ముదిరి పాకాపడ్డాయని చెప్పవచ్చు.
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
12 years ago
0 comments:
Post a Comment