Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Tuesday, August 3, 2010

రాజకీయ సంక్షోభం వస్తే ఆదుకుంటా: చిరు అభయ హస్తం


రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజుకో విధంగా మారిపోతున్న నేపధ్యంలో ఒకవేళ రాజకీయ సంక్షోభం తలెత్తితే ప్రజలపై భారం పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రజారాజ్యం పార్టీపై ఉన్నదని ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. అలా చెప్పడం ద్వారా కాంగ్రెస్ సర్కార్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కూలనివ్వబోనన్న దృఢ సంకల్పంతో చిరు ఉన్నట్లు అర్థమవుతోంది.

ఇటీవల రాజ్యసభ ఎన్నికల సమయంలో సోనియా గాంధీతో సమావేశమైన తర్వాత నుంచి చిరంజీవి క్రమంగా కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా మెలగుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలోనూ రోశయ్యకు చేదోడు వాదోడుగా ఉంటూ దాదాపు కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి మద్దతు పలుకుతున్నారు.

అయితే అప్పుడప్పుడు కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై ధ్వజమెత్తుతున్నారు. తాజాగా బార్‌ల ఏర్పాటు విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. జనభా ప్రాతిపదికన పాఠశాలలు, ఆస్పత్రులు ఏర్పాటు చేయకుండా బార్లను ఏర్పాటు చేయడం శోచనీయమని చిరు ఆవేదన వ్యక్తం చేశారు.

మొత్తమ్మీద చిరంజీవి చాలా త్వరగానే రాజకీయ క్రీడలను ఆకళింపు చేసుకున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

0 comments:

Post a Comment