సమాజానికి మేలు చేసే, ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చే అద్భుతమైన స్క్రిప్ట్ లభిస్తే ఆ చిత్రంలో నటించేందుకు ఏమాత్రం వెనుకంజ వేయబోనని ప్రజారాజ్యం పార్టీ అధినేత, మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. 'రోబో' చిత్రం ఆడియో ఫంక్షన్‌లో తాను చేసిన వ్యాఖ్యలు ఒక కళాకారుడిగా తన మనస్సులోని మాటలను వ్యక్తం చేశానన్నారు. దీనిపై పెడార్థాలు తీయడం సమంజసం కాదని విజ్ఞప్తి చేశారు.
నెల్లూరు జిల్లా కేంద్రంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. మూడు దశాబ్దాల పాటు కళాకారుడిగా ఉన్నానన్నారు. కళామతల్లిని వదిలి రాజకీయ రంగంలోకి వచ్చినంత మాత్రాన తనలోని కళాతృష్ణను చంపుకోలేనన్నారు. మంచి చిత్రాలు చూసేటపుడు ఇలాంటి చిత్రం మనం చేస్తే ఎలావుండేదనో.. లేక చేయలేక పోయామనో భావన ఒక కళాకారుడిగా తనకు కలుగుతుందన్నారు.
అందువల్ల భవిష్యత్‌లో అద్భుతమైన స్క్రిప్ట్ లభించి, దానికి తన వల్లే న్యాయం జరుగుతుందని భావిస్తే ఖచ్చితంగా ఆ చిత్రంలో నటించేందుకు వెనుకంజ వేయబోనన్నారు. ముఖ్యంగా, తాను నటించే చిత్రం ప్రజలకు మంచి సందేశం ఇస్తుందని, బాగా చైతన్య వంతులు చేస్తుందని అనుకుంటే తప్పకుండా చేస్తానని చిరంజీవి తేల్చి చెప్పారు.
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
12 years ago
0 comments:
Post a Comment