Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Saturday, August 7, 2010

కేసీఆర్ పార్టీని భూస్థాపితం చేసే రోజు వస్తుంది: చంద్రబాబు


రాష్ట్ర సమితి ఉపపార్టీ.. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ. తెలుగువారికోసం పుట్టిన పార్టీ. తెలుగువారికి సేవ చేసేందుకు ఆవిర్భవించిన పార్టీ. నేను తెలంగాణా - సీమాంధ్ర ప్రాంతాలకు ఉమ్మడి నాయకుడ్ని. ఏ ఒక్క ప్రాంతం నాకు ఎక్కువ కాదు... అలాగని తక్కువా కాదు. రెండు ప్రాంతాలు నాకు రెండు కళ్లు లాంటివి" అంటూ చంద్రబాబు నాయుడు తెలంగాణా అంశంపై స్పష్టమైన వైఖరిని తొలిసారిగా మీడియా ముందు ఆవిష్కరించారు.

తెలంగాణాపై తెలుగుదేశం పార్టీ దాగుడుమూతలు ఆడుతుందన్న విమర్శలను ఆయన కొట్టి పారేశారు. సున్నితమైన అంశంపై ఎక్కువ మాట్లాడటం కుదరదనీ, అయితే రెండు ప్రాంతాల ప్రజల మనోభావాలకు తగ్గట్లుగానే తమ పార్టీ ముందుకు పోతోందని బాబు అన్నారు.

9 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రింగా పనిచేసిన తనను రాష్ట్రంలోని రెండు ప్రాంతాల ప్రజలు గౌరవించారన్నారు. అటువంటిది ఏదో సమస్య వచ్చిందని ఒక ప్రాంతాన్ని వదులుకుని, మరో ప్రాంతానికి మద్దతు పలుకడం భావ్యం కాదన్నారు.

అసలు తెలంగాణాలో అభివృద్ధి ఏదైనా జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని బాబు పేర్కొన్నారు. అటువంటి తెలుగుదేశం పార్టీని తెలంగాణా రాష్ట్ర సమితి పనిగట్టుకుని విమర్శించడం తగదన్నారు. రెండు ప్రాంతాల్లోనూ రెండు విధాలుగా మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీని తెరాస ఎందుకు విమర్శించదో చెప్పాలని బాబు డిమాండ్ చేశారు.

కేసీఆర్ తెదేపాను తెలంగాణా ద్రోహులుగా అభివర్ణించడంపై స్పందిస్తూ.... ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చాడన్న సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. తెలంగాణాలో తమకు బలమైన క్యాడర్ ఉందనీ, తెరాస భూస్థాపితమయ్యే రోజు వస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారు.

తెలంగాణా అంశంపై శ్రీకృష్ణ కమిటీతో భేటీ అయ్యేందుకు మీకు అభ్యంతరం ఉందంటున్నారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, మా పార్టీలోని అందరు నాయకులు కమిటీతో మాట్లాడతారు. ఇందులో ఎటువంటి సందేహానికి తావులేదన్నారు.

0 comments:

Post a Comment