పులివెందుల శాసనసభ సభ్యురాలు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి సతీమణి, కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్.విజయలక్ష్మీ తన సభ్యత్వానికి రాజీనామా చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తన భర్త హఠాన్మరణం అనంతరం తమ కుటుంబం పట్ల కాంగ్రెస్ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరి ఆమెకు ఆగ్రహాన్ని తెప్పించినట్టుగా ఉంది. అందుకే.. కాంగ్రెస్ భిక్షతో వచ్చిన ఎమ్మెల్యే పదవికి గుడ్‌బై చెప్పాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్టు జగన్ సన్నిహిత వర్గాల సమాచారం.
దీనిపై రెండు మూడు రోజుల్లో ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత తన భర్త మొదటి వర్థంతి రోజైన సెప్టెంబరు రెండో తేదీన ఇడుపులపాయలో శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం రాజీనామా పత్రాన్ని పార్టీ అధిష్టానానికి నేరుగా పంపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిద్వారా మహిళా సెంటిమెంట్‌ను పొందవచ్చని జగన్ వర్గం వ్యూహంగా ఉంది.
వైఎస్.విజయలక్ష్మి రాజీనామా చేస్తే ఖచ్చితంగా ఆమె బాటలో మరికొంతమంది ఎమ్మెల్యేలు పయనిస్తారని జగన్ వర్గం భావిస్తోంది. తద్వారా తమ పట్ల చిన్నచూపు చూస్తున్న అధిష్టానానికి షాక్ ఇచ్చి వారి కళ్లు తెరిపించవచ్చన్నది వారి భావనగా ఉంది. విజయమ్మ రాజీనామా చేసిన మరుక్షణమే శాయంపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
వైఎస్‌లేని మంత్రివర్గంలో తాను కొనసాగలేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసి తన మంత్రిపదవి తృణప్రాయంగా త్యజించిన వైఎస్ వీరాభిమాని కొండా సురేఖ కావడం గమనార్హం. మొత్తంమీద వైఎస్.విజయలక్ష్మి తీసుకునే రాజీనామా నిర్ణయం రాష్ట్ర కాంగ్రెస్ సర్కారులో పెనుప్రకంపనలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
12 years ago
0 comments:
Post a Comment