"రజనీ నన్ను మోసం చేశాడు. తాను రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ పెద్ద ప్రచారం జరిగింది. ఇద్దరం మాట్లాడుకున్నాం... ఆయన వస్తున్నాడని నేను రాజకీయాల్లోకి వచ్చా. ఒక్కసారి వెనక్కి తిరిగితే.. రజనీ రాకపోగా.. రోబో సినిమాలో ఉన్నాడు. నన్ను గేటు బయటకు తోసి ఆయన లోపలే ఉన్నాడు. రోబో ట్రైలర్ చూశాక.. నాలో మళ్లీ నటించాలన్న కోరిక కలుగుతోంది. నా ఫ్యాన్స్ అడిగినా చేయనని చెప్పాను. కానీ ఇప్పుడు చేయాలనిపిస్తుంది అంటూ రోబో సినిమా ఘనవిజయాన్ని సొంతం చేసుకోవాల"ని కోరారు. 140 కోట్ల రూపాయల బడ్జెట్ ముందుగా సన్ పిక్చర్స్ సీఈఒ సక్సేనా మాట్లాడుతూ... ఈ చిత్రానికి ఏర్పడిన అవరోధాలు.. ఆ తర్వాత ఎలా గట్టెక్కామో వివరించారు. ఇటీవలే తమిళ ఆడియోను మలేషియాలో చేశాం. తర్వాత హిందీ వెర్షన్‌ను ముంబయిలో చేయబోతున్నాం అని చెప్పారు. సెప్టెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామనీ, ఎప్పుడనేది త్వరలో వెల్లడిస్తామన్నారు. అలాగే ఎన్ని ప్రింట్లనేవి కూడా ప్రస్తుతానికి చెప్పలేమన్నారు. రజనీకాంత్ సైంటిస్ట్‌గా, రోబోగా నటించారు. మరో పాత్రను కూడా పోషించారు. అది సస్పెన్స్. ఆ పాత్ర అదిరిపోయినట్లుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ దీనికి పనిచేసారు. 1500 కంప్యూర్ షాట్స్ ఇందులో ఉన్నాయి. ఇంగ్లీషు చిత్రాలైన మమ్మీ, 2011 చిత్రాల స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. శ్రీనివాస్ అనే ఆంధ్రకు చెందిన విజువల్ ఇంజనీర్ పనిచేశారు. అలాగే కుంగ్ ఫూ సినిమాలకు పనిచేసిన ఫ్రాంకీచెన్‌తో యాక్షన్ ఎపిసోడ్ చేశాం. పీటర్ హేన్స్ కూడా కొన్ని చేశాడు. రెండున్నర సంవత్సరాల కష్టం ఇది. ఎడిటర్ రెండున్నరేళ్లుగా ఎడిటింగ్ చేస్తూనే ఉన్నాడు. ఎన్నో వ్యయప్రయాసలుకోర్చి ఈ చిత్రం పూర్తి చేయడంతో ఎవరెస్ట్ ఎక్కినంత హాయిగా ఉందన్నారు. విలన్ పాత్ర ఇస్తాడేమోననుకున్నా: రజనీ శివాజీ తర్వాత ఏ సినిమా ఒప్పుకోలేదు. వయస్సు కూడా పెరిగింది. ఏమీ చేయకూడదు అనుకున్నాను. ఓ సందర్భంలో శంకర్ రోబో కథను టూకీగా చెప్పారు. ఆ గెటప్ నా వల్లకాదనుకున్నా. అసలు ముందుగా రోబో సినిమాను షారుక్ ఖాన్‌తో చేయాలనుకున్నారు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ శంకర్ సార్ వచ్చి నన్ను సినిమాలో నటించమని అడిగారు. ఆయన వచ్చి అందులో విలన్ పాత్ర ఉంది. అది చేయమంటారేమో... చేయనని చెప్పాలి... ఎలాగా... అని ఆలోచించాను. ఆ తర్వాత శంకర్ వచ్చి మీరు నటించాలి.. అన్నారు. ఏది ఆ విలన్ పాత్రేనా.. అని అడిగేసరికి.. కాదు సార్.. హీరోగా అన్నారు. షాక్‌కు గురయ్యాను. ఆ గెటప్స్ నా వల్లకాదు అన్నాను. మీరు ఏమీ చేయనవసరం లేదు. అన్నీ మేమే చూసుకుంటామని చెప్పారు. అలా ఆ సినిమా మొదలైంది. మధ్యలో కొన్ని కారణాల వల్ల ఆగింది. అప్పుడు ఇండస్ట్రీలో చాలామంది నవ్వుకున్నారు. శంకర్‌కు పట్టుదల పెరిగింది. మారన్ మోరల్ సపోర్ట్‌తో సినిమా పూర్తి చేశాం. ఎన్నో చిత్రాల్లో నటించాను. కానీ ఇంత మంచి మనిషిని చూడనేలేదు. గ్రేట్ పర్సన్. 140 కోట్ల రూపాయలకుపైగా ఖర్చయినా వెనుకాడలేదు. ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడను. థియేటర్లలో సెలబ్రేట్ చేసుకుంటుంది అని చెప్పారు.
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
12 years ago
0 comments:
Post a Comment