దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, డీసీసీ అధ్యక్షులు కలిసి బాధితులను గుర్తించి జాబితాను రూపొందిస్తారని ఏఐసీసీ పేర్కొంది.
వైఎస్ మృతిని తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా వందలాది సంఖ్యలో అనేక మంది ప్రజలు మరణించిన విషయం తెల్సిందే. ఈ కుటుంబాలను కడప ఎంపీ, వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తూ తన వంతు ఆర్థికసాయం చేస్తున్నారు.
దీన్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా పరిగణించింది. పార్టీ నియమావళికి వ్యతిరేకంగా జగన్ వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్‌కు చెక్ పెట్టేలా కాంగ్రెస్ హైకమాండ్ పావులు కదిపింది.
ఇందులోభాగంగా, వైఎస్ హఠాన్మరణంతో మృతి చెందిన వారి కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. బాధితులను పీసీసీ చీఫ్, డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు కలిసి ఎంపిక
ఆర్థిక సాయం పట్ల కాంగ్రెస్ వర్గాలు హర్షం వ్యక్తం చేసాయి
0 comments:
Post a Comment