దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత సీఎం కె.రోశయ్యల మధ్య ఉన్న బంధం విడదీయరానిదని ఎమ్మెల్సీ వైఎస్.వివేకానంద రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన పశ్చిమగోదావరి జిల్లా, సత్యవోలులో వైఎస్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ది పథకాలను ఏకకాలంలో రెండు కళ్లలా వైఎస్ అమలు చేశారన్నారు. ఈ పథకాలకు వీటికి నిధుల కొరత లేకుండా అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య ఎంతో సమర్థంగా వ్యవహరించారని చెప్పారు.
ఓ పక్క అప్పులు తీరుస్తూనే మరో పక్క అన్ని పథకాలకూ బడ్జెట్‌లో కేటాయింపులు జరిపారన్నారు. అందువల్ల వారిద్దరిది మేలి కలయికగా ఆయన అభివర్ణించారు. ప్రజాభిమానం గల యువనేత వైఎస్ జగన్‌ను కాంగ్రెస్ అధిష్టానం దీవించాలని అందరూ కోరుకుంటున్నారని వివేకా చెప్పుకొచ్చారు.
ప్రజాభిప్రాయాన్ని కాంగ్రెస్ అధిష్టానం తప్పకుండా గౌరవిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ అమలుచేయని సంక్షేమ అభివృద్ధి పథకాలను వైఎస్ హయాంలో చేపట్టారన్నారు. వాటిని ఇకపై కూడా కొనసాగించాలని ఆయన కోరారు.

0 comments:
Post a Comment