ఢిల్లీలో ఏఐసీసీ సమావేశం జరిగింది. సిడబ్ల్యుసీ పగ్గాలను మరోసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కట్టబెడుతూ తీర్మానం చేశారు. అంతా బాగానే ఉంది... కానీ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డిని స్మరించడాన్ని ఏఐసీసీ మరిచిందని వైఎస్సార్ వర్గీయులు ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రెండోసారి అధికారాన్ని కట్టబెట్టిన మహానేతకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వలేదని మండిపడుతోంది.
నెల్లూరు ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్ వెంట ఉన్న నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి హైకమాండ్ వైఖరిపై దుమ్మెత్తి పోశారు. రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి 32మంది ఎంపీలను అందించిన వైఎస్సార్ కుటుంబానికి అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా...? అంటూ ప్రశ్నించారు. కనీసం ఆయన పేరును కూడా ప్రస్తావించడానికి వారికి సమయం లేదా..? అని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు అంబటి రాంబాబు ఏఐసీసీపై నేరుగా విమర్శనా బాణాలు విసిరారు. వైఎస్సార్ పేరును ప్రస్తావించకుండా ఏఐసీసీ తప్పు చేసిందనీ, తద్వారా రాష్ట్ర ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. అయితే ఏఐసీసీ సమావేశాల్లో సంతాప తీర్మానాలు ఉండవనీ, కేవలం సీడబ్ల్యూసీ ఎన్నిక మాత్రమే ప్రధాన ఎజెండాగా ఉంటుందని సీనియర్ కాంగ్రెస్ నేత తులసి రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసిన వైఎస్సార్‌ను పార్టీ ఎట్టి పరిస్థితిల్లోనూ విస్మరించదనీ, వచ్చే డిసెంబరు ప్లీనరీ సమావేశాల్లో వైఎస్సార్ సంతాప కార్యక్రమం ఉంటుందన్నారు.
వైఎస్ వర్గీయుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం, ఏఐసీసీ సమావేశాల్లో వైఎస్సార్‌కు నివాళులర్పిస్తారని ప్రజలు ఎదురు చూశారనీ, ఆ కార్యక్రమం లేకపోవడంతో మండిపడుతున్నారన్నారు. వైఎస్సార్ కుటుంబాన్ని విస్మరిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 2003నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయని జోస్యం చెప్పారు.
ఇదిలావుండగా ఏఐసీసీ సమావేశాలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోపాటు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గైర్హాజరయ్యారు. దీంతో జగన్ వర్గం అధిష్టానంతో ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోందన్న వాదనలు బలంగా వినబడుతున్నాయి.

0 comments:
Post a Comment