BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
14 years ago
News And Views
బెంగళూరు: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టెస్ట్ క్రికెట్‌లో మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. 14 వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా ఖ్యాతికెక్కాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మాస్టర్ ఈ రికార్డు సృష్టించాడు. వ్యక్తిగత స్కోరు 27 పరుగులకు చేరుకోగానే సచిన్ ఖతాలో 14 వేల పరుగులు జమయ్యాయి. ఇందులో 48 సెంచరీలు, 57 అర్థ సెంచరీలు ఉన్నాయి. |
నెల్లూరు: తమ జిల్లాలో ఓదార్పుయాత్రను విజయవంతం చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఈ నెల 13న ఓదార్పుయాత్ర ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. 13న సాయంత్రం 4 గంటలకు రుద్రకోట నుంచి యువనేత జగన్ యాత్రకు శ్రీకారం చుడతారన్నారు. ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం ఈ నెల 11 నుంచి నెల్లూరులో యాత్ర ప్రారంభం కావాల్సివుంది. ప్రకాశం జిల్లాలో ప్రజా ఒత్తిడి పెరుగుతున్నందువల్లే యాత్ర ఆలస్యమవుతోందని చంద్రశేఖర్‌రెడ్డి వివరించారు. |
Flash Labels by Way2Blogging