Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Thursday, October 28, 2010

raktha charithra PART 2 HQ WALLPAPERS FIRST ON WEB


VivekOberai-At-Anantapur








HYDERABAD "THE MYSTIC EVOLUTION"

BAVA INSIDE INFO






CLICK ON IMAGE FOR LARGESIZE

Wednesday, October 27, 2010

'ఆరెంజ్‌' ఆడియోలో చిరంజీవి విమర్శలు, ప్రశంసలు


మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్‌ నటించిన 'ఆరెంజ్‌' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం రాత్రి శిల్పాకళా వేదికలో జరిగింది. అయితే హీరోహీరోయిన్లు షూటింగ్‌ నిమిత్తం ఆస్ట్రేలియాలో ఉండడంతో షూటింగ్‌కు ఇబ్బంది కలిగి విడుదలకు ఆలస్యమవుతుందని చరణ్‌ లేకుండా ఆడియో విడుదల చేస్తున్నామని చిరంజీవి చెప్పారు. చెప్పిన సమయానికి గంటన్నర ఆలస్యంగా జరిగిన వేడుకలో చిరంజీవి ఎక్కువసేపు మైక్‌లో మాట్లాడడం అభిమానులకే కాస్త చికాకు పుట్టించింది. 

ఎప్పుడూలేని విధంగా ఆయన మాట్లాడే తీరు ప్రిపరేషన్‌గా వచ్చినట్లు అర్థమయింది. ఒకవైపు దాసరిని ఇన్‌డైరెక్ట్‌గా విమర్శిస్తూ, మరోవైపు బాలకృష్ణను పొగుడుతూ ప్రసంగం సాగడం విశేషం. అలాగే బ్లడ్‌బ్యాంక్‌పై విమర్శలు కురిపించిన రాజశేఖర్‌ దంపతుల్ని కూడా ఇన్‌డైరెక్ట్‌గా చురక వేశారు.

అవార్డులు తెచ్చుకోకూడదు 
నేను 'రుద్రవీణ', 'ఆపద్భాంధవుడు' సినిమాను నా అభిరుచి మేరకు చేశాను. అయితే అవార్డులు మాత్రమే వచ్చాయి. నందీ అవార్డులు మనం తెచ్చుకోకూడదు. వాటంతట అవే మన వద్దకు రావాలి. ఈ అవార్డులు శాశ్వతం కాదు. దానికంటే ప్రేక్షుల అభిమానం గొప్పది.

చరణ్‌ మథనపడేవాడు 
'మగధీర' చిత్రం తర్వాత ఆదరణ చూసి చరణ్‌ చాలా మథనపడేవాడు. అభిమానులకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోనని. ఇంత ఆదరణ పొందిన చిత్రం తర్వాత ఎలాంటి సినిమా చేయాలా అని మథనపడ్డాడు. తను పడిన మానసిక సంఘర్షణ నాకు తెలుసు. అప్పుడు నేను ఒక్కటే చెప్పాను.. సూపర్‌స్టార్‌ అనేది ఊరికేరాదు. కష్టపడాలి. రజనీకాంత్‌ రోబో చేయకపోతే ఇంత పేరు వచ్చేదా.. అని సూచించాను. నేను 250 అడుగుల పై నుంచి బంగీ జంప్‌ చేస్తే.. ఇందులో రామ్‌చరణ్‌ 4వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవ్‌ చేశాడు. ఇంట్లో అంతా కంగారుపడ్డాం. అభిమానుల ఆశీస్సులున్నాయి. అవిచాలు.

సింహా గ్రేట్‌ హిట్‌ 
ఎన్నోసినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. కొన్ని సినిమాలు నిర్మాతలకు లాభం చేకూర్చుతాయి. మరికొన్ని డిస్ట్రిబ్యూటర్లకు. ఇంకొన్ని ఎగ్జిబిటర్లుకు. మగధీర తర్వాత అంతటి రేంజ్‌ హిట్‌ ఇచ్చిన చిత్రం 'సింహా'. అందరికీ లాభాల్ని చేకూర్చిన చిత్రమదని అన్నారు.

బ్లడ్‌బ్యాంక్‌లో తప్పులేదు 
ఆ తర్వాత బ్లడ్‌బ్యాంక్‌లో అవినీతి జరుగుతున్నట్లు కొందరు ఆక్షేపించారు. దానిపై ఉన్న అపప్రధ పోవడానికి ప్రభుత్వాన్ని పరిశీలించమని విన్నవించాను. దానిపై ఈరోజు నివేదిక వచ్చింది. నిష్పక్షపాతంగా బ్లడ్‌‌బ్యాంక్‌ సేవలను కొనియాడుతూ వచ్చిన రిపోర్ట్‌ విమర్శల పాలిట చెంపపెట్టు.. అంటూ.. బ్లడ్‌‌బ్యాంక్‌కు రక్తం దానంచేసిన వారిని సన్మానిస్తూ వారిచేత వందనాలు స్వీకరించారు చిరంజీవి.

ఇక రామ్‌చరణ్‌ ఆస్ట్రేలియాలోనుంచి టెలికాన్ఫెరెన్స్‌ లైవ్‌లో చూపించారు. నేను షూటింగ్‌ నిమిత్తం ఇక్కడ ఉన్నాను. హారీస్‌ జైరాజ్‌ వెంకటేష్‌తో చేసిన వాసు చిత్రం పాటలు విన్నప్పటి నుంచి అతని ఫ్యాన్‌ అయ్యాను. పాటలు అన్నీ ఎంజాయ్ చేసేట్లుగా ఉన్నాయి. దర్శకుడు భాస్కర్‌ సినిమాను బాగా తీశాడు. మగధీర తర్వాత వస్తున్న ఆరెంజ్‌ను అంత డెడికేషన్‌తో చేస్తున్న చిత్రమిది. మగధీర తర్వా ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నానో అది ఈ చిత్రంతో నెరవేరింది అన్నారు.

జెనీలియా కూడా అక్కడనుంచే మాట్లాడుతూ...మంచి మ్యూజికల్‌ లవ్‌స్టోరీ. అందరూ ఎంజాయ్ చేసేట్లుగా ఉంటుంది అన్నారు. ఈ చిత్ర ఆడియోను రామానాయుడు విడుదల చేసి చిరంజీవికి అందించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి కుటుంబమంతా పాల్గొంది. చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజ పాల్గొనడం అక్కడి వారిని ఆకర్షించింది.

తెలంగాణ రాదు.. అందుకే కళాతోరణానికి మరమ్మతులు!



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేసే ఉద్దేశ్యం లేదని కాంగ్రెస్ అధిష్టానం సూచనప్రాయంగా వెల్లడించినట్టు సమాచారం. ఈ విషయాన్ని సీమాంధ్ర నేత, రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత టి.సుబ్బిరామిరెడ్డికి చెప్పినట్టు వినికిడి. అందుకే ఆయన పది కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ఉడతాభక్తిగా ప్రభుత్వానికి అందజేయనున్నారు. 

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో తెలుగు లలిత కళాతోరణం ప్రస్తుతం అధ్వాన్న స్థితిలో ఉంది. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఒకవేళ నిర్వహించాలని ఎవరైనా భావిస్తే.. వారి చేతి చమురు వదులుతోంది. సకల సదుపాయాలను సమకూర్చుకోవాల్సి వస్తోంది. దీంతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏ ఒక్కరూ ముందుకు రావడంలేదు. 

ఈ పరిస్థితుల్లో దీనికి మరమ్మతులు చేసేందుకు ఎవరైనా దాతలు ముందుకు రావాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆ వెంటనే కళాభిమానం కలిగిన వ్యక్తిగా టీఎస్సార్‌ ముందుకు వచ్చి.. పది కోట్ల రూపాయల వ్యయంతో ఆధునకీకరించనున్నట్టు ప్రకటించారు. 

దీనికి ప్రతిఫలంగా ఆయన ఈ ఆడిటోరియం పేరును రాజీవ్ కళాతోరణంగా మార్చాలని ప్రతిపాదించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం టీఎస్సార్ అడిగిందే తడవుగా ఆమోదం తెలిపింది. అయితే, దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం చెలరేగడంతో ప్రభుత్వం తొలుత చేసిన ప్రకటనను సరి చేసి, రాజీవ్ తెలుగు కళాతోరణంగా మార్చుతూ జీవోను జారీ చేసింది. 

ఇదిలావుండగా, రాష్ట్రంలో ప్రత్యేక, సమైక్యాంధ్ర ఉద్యమాల వేడి ఇంకా తగ్గని నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని పదికోట్ల రూపాయలను ఉదారంగా ఇచ్చేందుకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేత ఎవరైనా ముందుకు వస్తారా అన్నదే ఇక్కడ కలిగే ధర్మసందేహం. కానీ, కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా మేలిగే టీఎస్సార్ ఈ ఆడిటోరియంను మరమ్మతులు చేసేందుకు ముందుకు వచ్చారు. ఇందుకోసం పది కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్టు ప్రకటించారు. 

ఒకవేళ రేపు రాష్ట్రం విడిపోతే ఈ రాజీవ్ తెలుగు కళాతోరణం తెలంగాణ ప్రాంతానికే చెందుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రూ.పది కోట్లు వెచ్చించి ఆధునకీకరించేందుకు టీఎస్సార్ ఎందుకు ఆసక్తి చూపారన్నదే ఇపుడు అందరి మెదళ్ళను తొలుస్తున్న ప్రశ్న. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే... టీఎస్సార్ ఇంత సాహసానికి చొరవ చూపేవారు కాదన్నది రాష్ట్ర వర్గాల సమాచారం. 

డిసెంబరు 31వ తేదీన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ రాష్ట్ర పరిస్థితులపై నివేదిక సమర్పించినప్పటికీ.. ఆ నివేదికను బహిర్గతం చేయడమా లేదా అన్నది కేంద్ర విజ్ఞతపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయకుండా ఆ ప్రాంత అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాష్ట్ర రాజకీయ పార్టీల్లోనే ఐకమత్యం, స్పష్టత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన ఏర్పాటుకు కేంద్రం మొగ్గు చూపక పోవచ్చన్నది కొంతమంది నిపుణులు అభిప్రాయం. ఆ ధీమాతోనే టి.సుబ్బిరామిరెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. పైపెచ్చు తెలుగు లలితకళాతోరణం పేరును రాజీవ్ 
తెలుగు కళాతోరణంగా పేరుమార్పించి అధిష్టానానికి మరింత దగ్గరయ్యారని చెప్పవచ్చు

పొరపాటునో.. గ్రహపాటునో సీఎంను అయ్యాను: రోశయ్య


రాష్ట్రంలో ఏర్పడిన కొన్ని పరిస్థితుల కారణంగా పొరపాటునో.. గ్రహపాటునో తాను ముఖ్యమంత్రిని అయ్యానని సీఎం కొణిజేటి రోశయ్య అన్నారు. అంతమాత్రానా మీకున్నంత పరిజ్ఞానం, ఫింగర్‌టిప్స్‌పై గణాంకాల వివరాలు ఉండాలని ఉందా అని ఆయన మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. 

ముఖ్యమంత్రి రోశయ్య మంగళవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాపై మండిపడ్డారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలు ఆయనను తీవ్ర అసహనానికి గురి చేసింది. దీంతో ఆయన మీడియాపై చిర్రుబుర్రులాడారు. 

డీఎస్సీ నియామకాలకు సంబంధించిన ఫైలు తన టేబుల్‌పైకి వచ్చిన ఐదు నిమిషాల్లో సంతకం చేసి మంత్రి కార్యాలయానికి పంపినట్టు తెలిపారు. మిగిలిన వివరాలు ఏవైనా ఉంటే ఆయనను అడిగి తెలుసుకోండి అంటూ కోపగించుకున్నారు. 

ముఖ్యమంత్రి సీటులో ఉన్నంత మాత్రాన అన్ని విషయాలు తెలియాలనే రూలు ఉందా అంటూ ప్రశ్నించారు. దానికో మంత్రి ఉన్నారని, ఆయనను అడిగి మిగిలిన వివారాలు తెలుసుకోవచ్చన్నారు. అంతేకానీ, అన్ని సమస్యలకు, ప్రశ్నలకు ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలనే కోరడం సబబు కాదన్నారు.

డిసెంబరు తర్వాత బహిరంగ యుద్ధమే: విజయశాంతి


డిసెంబరు 31వ తేదీ తర్వాత రాష్ట్రంలో బహిరంగ యుద్ధమేనని తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా నేత, మెదక్ ఎంపీ విజయశాంతి హెచ్చరించారు. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం సానుకూల ప్రకటన చేయకపోతే యుద్ధం చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. 

తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ జిల్లాల్లో పల్లెబాట కార్యక్రమం జరుగుతున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా మంగళవారం జరిగిన మెదక్ జిల్లా పర్యటనలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా పటాన్‌చెరు, జిన్నారం మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో విజయశాంతి పాల్గొని ప్రసంగించారు. 

డిసెంబర్ 31 తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగే యుద్ధానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 31 తర్వాత తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల ప్రకటన చేయని పక్షంలో బహిరంగ యుద్ధం తప్పదని జోస్యం చెప్పారు.

తెలంగాణలోని ఆంధ్రా నేతల విగ్రహాలు కూలుతాయ్: కేటీఆర్



గిరిజన పోరాట యోధుడు కొమురం భీం విగ్రహాన్ని హైదరాబాద్‌లో పెట్టడానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే తెలంగాణలోని ఆంధ్రా నేతల విగ్రహాలు పగులుతాయని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు హెచ్చరించారు. కొమురం భీం విగ్రహం పెట్టకపోతే, తెలంగాణలో వందలు.. వేల సంఖ్యలో ఉన్న ఆంధ్రా నేతల విగ్రహాలు రోజుకొక్కటి చొప్పున కూలిపోతాయన్నారు.
కొమరం భీమ్ విగ్రహం ఏర్పాటుపై నెలకొన్న వివాదంపై కేసీఆర్ మాట్లాడుతూ.. గిరిజన పోరాట యోధునికి హైదరాబాద్‌లో విగ్రహం ఏర్పాటు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఒర అంగుళ స్థలం లేదని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నట్టు చెప్పారు. కొమరం భీమ్ విగ్రహం ఏర్పాటుకు కొంత గడువు ఇస్తున్నామని, ఆ గడువులోగా ఏర్పాటు చేయకపోతే.. తెలంగాణ ప్రాంతంలోని ఆంధ్రానేతల విగ్రహాలు ఎపుడు పగులుతాయో.. ఎలా పగులుతాయే మీరే చూస్తారని వ్యాఖ్యానించారు. 
తెలంగాణలోని 10 జిల్లాల ప్రజలు కొమురం భీంను స్మరించుకోవాలన్నా.. పూలదండ వేయాలన్నా ఒక్క విగ్రహం కూడా లేకపోవడాన్ని తప్పుపట్టారు. కొమురం భీం విగ్రహం ఏర్పాటు చేస్తామని జీవో జారీ చేసిన ప్రభుత్వానికి హైదరాబాద్‌లో స్థలమే దొరకట్లేదా అని ప్రశ్నించారు.

డిసెంబర్ తర్వాత ఉమ్మడిగా తెలంగాణ పోరు: విద్యాసాగర్‌రావు

AA
శ్రీ కృష్ణ కమిటీ రిపోర్టు తెలంగాణాకు అనుకూలంగా లేకుంటే డిసెంబర్‌ తర్వాత అన్నివర్గాలు ఏకమై పోరాటం సాగిస్తాయని బిజెపి నేత విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు. ఇప్పుడు ఎవరి పంథాలో వారు తెలంగాణా కోసం ఉద్యమిస్తున్నారని... డిసెంబర్‌ తర్వాత వీరంతా ఏకమైతారని ఆయన అన్నారు. తెలంగాణా టిడిపి నేతలకు ప్రధాని, సోనియాలు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. 

ORANGE AUDIO LAUNCH EXCLUSIVE




































CLICK ON IMAGE FOR LARGESIZE



  

Orange MARKING