Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Tuesday, August 31, 2010

మేరీ మాత కలలోకి వచ్చింది: పవన్ కల్యాణ్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఏసుక్రీస్తు నేపధ్యంగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ను జెరూసలేంలో చేస్తున్నారు. మంగళవారం చిత్ర నిర్మాత కొండా కృష్ణంరాజు, హీరో పవన్ కల్యాణ్ టెలీకాన్ఫెరెన్స్ ద్వారా విలేకరులతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌తో మాటామంతీ...

ఏసుక్రీస్తు.. అంటే భక్తిరస ప్రధాన చిత్రంలో ఎందుకు చేయాలనుకున్నారు..? 
ఒకరోజు మా అబ్బాయి పొరపాటున కిందపడిపోయాడు. దాంతో వాడి మోకాలికి గాయం అయింది. వాడు బాధపడుతుంటే ఆ దెబ్బ నాకే తగిలినంత ఫీల్ అయ్యాను. ఎందుకో తెలియదు.. ఆ క్షణంలో మేరీమాత గుర్తుకు వచ్చింది. తన కుమారుడు క్రీస్తును చిత్ర హింసలు పాల్జేస్తుంటే ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లి ఉంటుందో అనిపించింది. 

అలా ఆ రాత్రి ఆ ఆలోచనలతోనే నిద్రపోయా. ఉదయం లేచేసరికి కొండా కృష్ణంరాజుగారు ఏసుక్రీస్తుపై చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు చెప్పారు. పైగా ఆ చిత్రంలో నన్ను నటించమని అడిగారు. ఇంకేముంది ఆ మేరీమాతే ఈ పనికి సంకల్పించి ఉంటుందని అంగీకరించా.

క్రైస్తవులకు సంబంధించి మీకు ఏమీ తెలియదు. మరి సినిమాలో ఎలా చేస్తారు..? 
నా స్కూలు చదువంతా మిషనరీ స్కూల్లోనే సాగింది. నాకు చాలామంది క్రైస్తవ స్నేహితులున్నారు. 

కమర్షియల్ హీరోగా ముద్రపడిన మీరు ఆధ్యాత్మిక చిత్రాలవైపు మళ్లడం.. కెరీర్‌కు ఇబ్బంది కాదా..? 
అలాంటిదేమీ ఉండదు. పాత్రలో దమ్ము ఉండాలి. అటువంటి పాత్ర దొరికినపుడు అది ఆధ్యాత్మికమా.. మరొకటా అని చూడను. నచ్చితే చేసేందుకు నేను ఎప్పుడూ సిద్ధమే.

సరే.. ఇపుడు క్రైస్తవులకు సంబంధించి చేస్తున్నారు... భవిష్యత్తులో హిందూ దేవుళ్లకు సంబంధించి ఏదైనా చిత్రంలో నటిస్తారా..? 
అలాంటి బేధాలేమీలేవు. మన దేశం అనేక మతాల సమ్మేళనం. అన్ని మతాలు సమానమే. నేను ముందు చెప్పినట్లుగా పాత్ర నచ్చితే నటించడానికి నేను సిద్ధమే.

అసలు ఈ చిత్రాన్ని చేయడం వెనుక ఎవరిదైనా ప్రభావం ఉన్నదా...? 
బహుశాః నాకు తెలిసి ఒక సంఘటన నాపై తీవ్రంగా ప్రభావం చూపిందనే చెప్పాలి. ఒరిస్సాలో ఒక వ్యక్తి మతమార్పిడికి పాల్పడుతున్నాడంటూ అతడిని కొందరు హతమార్చారు. ఆ తర్వాత హత్యకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి శిక్ష పడే తరుణంలో హతుని భార్య వారినందరినీ క్షమిస్తున్నట్లు ప్రకటించి వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని అభ్యర్థించింది. నిజంగా ఆ సంఘటన నా జీవితంలో మర్చిపోలేనిది. అంతటి క్షమాగుణం కొందరికే సాధ్యం. వారు భగవంతులతో సమానమే.

ఏసుక్రీస్తు చిత్రంలో మీ పాత్ర ఎటువంటిది..? 
ఇది మాత్రం మీరు వెండితెరపై చూడాల్సిందే అని ముగించారు పవన్ కల్యాణ్

నక్సలిజం అణిచివేతలో పనితీరు భేష్: గిరీష్ కుమార్

రాష్ట్రంలో నక్సలిజాన్ని అణిచి వేయడంలో రాష్ట్ర పోలీసు శాఖ పనితీరు భేషుగ్గా ఉందని రాష్ట్ర డీజీపీ గిరీష్ కుమార్ అన్నారు. అదేసమయంలో రాష్ట్ర డీజీపీ విధులు నిర్వర్తించినందుకు చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు.

గిరీష్ కుమార్ పదవీ కాలం మంగళవారంతో ముగియనుంది. దీంతో ఆయన పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. అంబర్‌పేట సీపీఎల్‌లో జరిగిన ఫేర్‌వెల్ పెరేడ్‌ కార్యక్రమానికి పలువురు సీనియర్ ఐపీఎస్‌ అధికారులు, ఎస్పీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు.

Monday, August 30, 2010

జగన్.. చెప్పుడు మాటలు విని భవిష్యత్ పాడుచేసుకోకు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొంతమంది నాయకుల మాటలు విని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని రాష్ట్ర వైద్యశాఖామంత్రి దానం నాగేందర్ హితవు పలికారు. జగన్‌కు రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉన్నదనీ, కానీ కొంతమంది నాయకులు ఆయన చెవెమ్మట జోరీగలా మారి ఆయన భవిష్యత్తును పాడుచేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు.

అధిష్ఠానం మాటలు జగన్ మంచికోసమే తప్ప, ఆయన ఎదుగుదలకు అడ్డుగోడగా నిలిచేవి కావని అభిప్రాయపడ్డారు. కొంతమంది నాయకులు జగన్‌కు అధిష్ఠానానికి మరింత దూరాన్ని పెంచడమే పనిగా పెట్టుకున్నారన్నారు.

వైఎస్సార్ ప్రథమ వర్థంతిని ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నాగేందర్ వెల్లడించారు.

స్వార్ధం @ ఏ ఐ సీసీ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, డీసీసీ అధ్యక్షులు కలిసి బాధితులను గుర్తించి జాబితాను రూపొందిస్తారని ఏఐసీసీ పేర్కొంది. 

వైఎస్ మృతిని తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా వందలాది సంఖ్యలో అనేక మంది ప్రజలు మరణించిన విషయం తెల్సిందే. ఈ కుటుంబాలను కడప ఎంపీ, వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తూ తన వంతు ఆర్థికసాయం చేస్తున్నారు. 

దీన్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా పరిగణించింది. పార్టీ నియమావళికి వ్యతిరేకంగా జగన్ వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్‌కు చెక్ పెట్టేలా కాంగ్రెస్ హైకమాండ్ పావులు కదిపింది. 

ఇందులోభాగంగా, వైఎస్ హఠాన్మరణంతో మృతి చెందిన వారి కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. బాధితులను పీసీసీ చీఫ్, డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు కలిసి ఎంపిక 
ఆర్థిక సాయం పట్ల కాంగ్రెస్ వర్గాలు హర్షం వ్యక్తం చేసాయి 

Sunday, August 29, 2010

NAG

నేడు గిడుగు జయంతి: తెలుగు మాతృభాషా దినోత్సవం

తెలుగు మాతృభాషా దినోత్సవాన్ని రాష్ట్ర పజలు జరుపుకుంటున్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు 147వ జయంతిని మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. విశిష్ట వ్యవహారికం పేరిట వాడుక భాషలో బోధనకు ఆయన పెద్దపీట వేశారు. శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేటలో 1863 ఆగస్టు 29న వీర్రాజు, వెంకమ్మ దంపతులకు గిడుగు జన్మించారు.

ఆ తర్వాత ఏవీఎన్ కాలేజీ ప్రధానాధ్యాపకుడు శ్రీనివాస అయ్యంగార్, గురజాడ అప్పారావు, యేట్స్, గిడుగు రామమూర్తి పంతులు కలిసి వ్యావహారిక భాషలో బోధనోద్యమానికి శ్రీకారం చుట్టారు. అప్పటికే రామమూర్తి వ్యావహారిక భాషలో బోధన కోసం ప్రచారం చేయడం ఆరంభించారు. ఇందుకోసం ఆయన తెలుగు అనే పత్రికను గిడుగు ప్రారంభించారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

వైఎస్ - రోశయ్యల బంధం విడదీయరానిది: వైఎస్.వివేకా

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత సీఎం కె.రోశయ్యల మధ్య ఉన్న బంధం విడదీయరానిదని ఎమ్మెల్సీ వైఎస్.వివేకానంద రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన పశ్చిమగోదావరి జిల్లా, సత్యవోలులో వైఎస్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ది పథకాలను ఏకకాలంలో రెండు కళ్లలా వైఎస్ అమలు చేశారన్నారు. ఈ పథకాలకు వీటికి నిధుల కొరత లేకుండా అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య ఎంతో సమర్థంగా వ్యవహరించారని చెప్పారు. 

ఓ పక్క అప్పులు తీరుస్తూనే మరో పక్క అన్ని పథకాలకూ బడ్జెట్‌లో కేటాయింపులు జరిపారన్నారు. అందువల్ల వారిద్దరిది మేలి కలయికగా ఆయన అభివర్ణించారు. ప్రజాభిమానం గల యువనేత వైఎస్ జగన్‌ను కాంగ్రెస్ అధిష్టానం దీవించాలని అందరూ కోరుకుంటున్నారని వివేకా చెప్పుకొచ్చారు. 
ప్రజాభిప్రాయాన్ని కాంగ్రెస్ అధిష్టానం తప్పకుండా గౌరవిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ అమలుచేయని సంక్షేమ అభివృద్ధి పథకాలను వైఎస్ హయాంలో చేపట్టారన్నారు. వాటిని ఇకపై కూడా కొనసాగించాలని ఆయన కోరారు.

Friday, August 27, 2010

కధ-స్క్రీన్ ప్లే - దర్శకత్వం - అప్పలరాజు -రామ్ గోపాల్ వర్మ

కధ-స్క్రీన్ ప్లే - దర్శకత్వం - అప్పలరాజు  చిత్రం ఈరోజు    హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది  ముఖ్య అతిధులు గా శ్రీదేవి బోనికపూర్ , అక్కినేని నాగార్జున తదితరులు హాజరు అయ్యారు ఈ  సినిమా ప్రారంభం కార్యక్రమ౦ లో దర్శకులను దెప్పి తు ఒక పాటను దర్శకుడు రాంగోపాల్ వర్మ వినిపించారు ఈ పాట వినిపించడం వల్ల సినిమా పయిన ఇంకా ఆసక్తి పెరిగింది  అని కొందరు అభిప్రాయ పడ్డారు ఏది ఏమయినా మన వర్మ స్టైల్ ఏ వేరు లక్ తో శివ సినిమా  తీసి  షోలే ను చెడగొట్ట అంటూ ప్రారభం అయ్యే ఈ పాట పెద్ద హిట్ అవ్వడం ఖాయం

టాలీవుడ్ "కింగ్" నాగార్జున లాంటి యంగ్ అండ్ డైనమిక్, ఎనర్జిటిక్ స్టార్ ఇంకెవ్వరూ లేరని అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి అన్నారు. నాగార్జునతో టాలీవుడ్‌లో నటించడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె వెల్లడించారు. చాలాకాలం తర్వాత తెలుగు వారందరినీ కలుసుకునే అవకాశం వచ్చిందన్నారు. 

నాగ్ చాలా హార్డ్‌వర్కర్, అతనిలా కో-ఆపరేట్ చేసే యాక్టర్ మరొకరు లేరని కితాబిచ్చింది. సినీ ప్రపంచంలో తాను ఈ స్థాయికి ఎదగడానికి దర్శకులు, ప్రత్యేకంగా రాఘవేంద్రరావు, నిర్మాతలు, ప్రేక్షకులు, అభిమానుల ఆదరణే ప్రధాన కారణమని చెప్పారు. సినీ ప్రపంచంలో తాను గొప్ప స్థాయికి ఎదగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి తాను రుణపడి ఉన్నానన్నారు.

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సునీల్ హీరోగా రూపుదిద్దుకోనున్న కొత్త చిత్రం "కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్రావు"కు క్లాప్ కొట్టేందుకు శ్రీదేవి, బోనీకపూర్ దంపతులు హైదరాబాద్‌కు వచ్చారు. అన్నపూర్ణ స్టూడియోలో సునీల్-రామ్‌గోపాల్ వర్మ కొత్త సినిమా శుక్రవారం ఆరంభమైంది. ప్రముఖ హాస్యనటుడు, హీరో సునీల్‌పై తీసిన ముహూర్తపు షాట్‌కు అతిలోక సుందరి శ్రీదేవి, కింగ్ నాగార్జున క్లాప్ కొట్టి ఆరంభించారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ.. శ్రీదేవితో ఆఖరి పోరాటం నటించే సమయంలో చాలా జడుసుకున్నానన్నారు. మిస్ ఇండియాతో నటించడమంటే కాస్త భయమేసిందని, కానీ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, శ్రీదేవి సహకారంతో ఆ చిత్రంలో నటించానని నాగ్ చెప్పారు. అలాగే రామ్ గోపాల్ వర్మతో కొత్త చిత్రం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కింగ్ అన్నారు. "రామ్ నీతో సినిమా చేసేందుకు నేను రెడీ. ఎంత టైమ్ అయినా ఫర్లేదు. నేనెప్పుడూ యంగ్‌గా ఉంటానని" చలోక్తి విసిరారు.

ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, నాగార్జున, రానా, నాగచైతన్య, నితిన్, సుమంత్, కలర్స్ స్వాతి తదితరులు హాజరయ్యారు.

Saturday, August 21, 2010

అబ్బే.. ఆ కమిటీ రాష్ట్ర విభజన కోసం కాదు: కేంద్రం

జస్టీస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కోసం కాదని కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తేల్చి చెప్పింది. గత యేడాది డిసెంబరు తొమ్మిదో తేదీ తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల అధ్యయనం కోసమే ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు దేశ అత్యున్నత న్యాయస్థానానికి కేంద్రం తెలియజేసింది.

రాష్ట్ర విభజనం కోసం కేంద్రం.. శ్రీ కృష్ణ కమిటీ ఏర్పాటుతో పాటు, రాజ్యాంగంలోని మూడవ అధికరణానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించటాన్ని సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన సమతా పార్టీ జాతీయ నేత, సమైక్యాంధ్ర ప్రతినిధి వి.వి.కృష్ణారావు, తిరుపతికి చెందిన కె.పుష్పలత ఈ ఏడాది ఫిబ్రవరి ఐదో తేదీన సుప్రీం కోర్టులో పిటీషన్‌ను దాఖలు చేశారు.

ఈ పిటీషన్‌పై జస్టిస్ కపాడియా, రాధాకృష్ణన్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటీషనర్ల తరపున హరీశ్‌సాల్వే వాదించారు. పిటీషనర్లు లేవనెత్తిన మౌలిక అంశాలు, శ్రీకృష్ణ కమిటీపై తమకు సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు కేంద్రానికి నోటీసులు పంపగా, వీటిపై కేంద్రం తగిన రీతిలో సమాధానం ఇచ్చింది. కేంద్రం సమర్పిచిన సమాధాన పత్రంలో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన కోసం మాత్రం కమిటీని ఏర్పాటు చేయలేదని తేల్చిచెప్పింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు, అధ్యయనం చేసేందుకు మాత్రమే ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించినట్టు కేంద్రం ఏనాడూ ప్రకటించలేదని కూడా సుప్రీంకోర్టుకు పంపిన సమాధాన పత్రంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం గమనార్హం. కేంద్రం తాజా సమాధానంపై తెలంగాణ ప్రాంత నేతలు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Monday, August 9, 2010

రాజీనామా యోచన దిశగా వైఎస్.విజయలక్ష్మి?

పులివెందుల శాసనసభ సభ్యురాలు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి సతీమణి, కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్.విజయలక్ష్మీ తన సభ్యత్వానికి రాజీనామా చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తన భర్త హఠాన్మరణం అనంతరం తమ కుటుంబం పట్ల కాంగ్రెస్ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరి ఆమెకు ఆగ్రహాన్ని తెప్పించినట్టుగా ఉంది. అందుకే.. కాంగ్రెస్ భిక్షతో వచ్చిన ఎమ్మెల్యే పదవికి గుడ్‌బై చెప్పాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్టు జగన్ సన్నిహిత వర్గాల సమాచారం.

దీనిపై రెండు మూడు రోజుల్లో ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత తన భర్త మొదటి వర్థంతి రోజైన సెప్టెంబరు రెండో తేదీన ఇడుపులపాయలో శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం రాజీనామా పత్రాన్ని పార్టీ అధిష్టానానికి నేరుగా పంపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిద్వారా మహిళా సెంటిమెంట్‌ను పొందవచ్చని జగన్ వర్గం వ్యూహంగా ఉంది.

వైఎస్.విజయలక్ష్మి రాజీనామా చేస్తే ఖచ్చితంగా ఆమె బాటలో మరికొంతమంది ఎమ్మెల్యేలు పయనిస్తారని జగన్ వర్గం భావిస్తోంది. తద్వారా తమ పట్ల చిన్నచూపు చూస్తున్న అధిష్టానానికి షాక్ ఇచ్చి వారి కళ్లు తెరిపించవచ్చన్నది వారి భావనగా ఉంది. విజయమ్మ రాజీనామా చేసిన మరుక్షణమే శాయంపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

వైఎస్‌లేని మంత్రివర్గంలో తాను కొనసాగలేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసి తన మంత్రిపదవి తృణప్రాయంగా త్యజించిన వైఎస్ వీరాభిమాని కొండా సురేఖ కావడం గమనార్హం. మొత్తంమీద వైఎస్.విజయలక్ష్మి తీసుకునే రాజీనామా నిర్ణయం రాష్ట్ర కాంగ్రెస్ సర్కారులో పెనుప్రకంపనలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి