Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Saturday, August 7, 2010

ఐదు శాతబ్దాల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు సాగించిన తరహాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో పాలన సాగించారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల


ఐదు శాతబ్దాల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు సాగించిన తరహాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో పాలన సాగించారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ అభిప్రాయపడ్డారు. ఈ తరహా పాలనను అందించే నేత రాష్ట్రంలో మరెవ్వరూ లేరన్నారు. అనంతపురం జిల్లా పెనుగొండలో జరిగిన శ్రీకృష్ణదేవరాయల పంచ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ఆయన గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొయిలీ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల పాలనతో దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి పాలనను పోల్చవచ్చన్నారు. శ్రీకృష్ణదేవరాయలులా వైఎస్సార్ ప్రజారంజకమైన పాలన సాగించారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో పేదల పాలిట పెన్నిధిగా మారిన వైఎస్సార్ సేవలను ప్రజలు ఎల్లవేళలా గుర్తుంచుకుంటారన్నారు. శ్రీకృష్ణదేవరాయలు అన్ని కళలను ప్రోత్సహించి, జనరంజకంగా పాలన సాగించారన్నారు. అదే తరహాలోనే దివంగత నేత వైఎస్సార్ ఉత్తమమైన పాలనను అందించి, కోట్లాది మంది ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచి పోయారన్నారు.

తిరుమల కొండపై కొండత అవినీతి: చంద్రబాబు ధ్వజం

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల గిరులపై కొండంత అవినీతి జరుగుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో తితిదే పాలక మండలిని ప్రక్షాళన చేసి, తిరుమల పవిత్రతను కాపాడాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

తిరుమలలో చోటు చేసుకుంటున్న అవినీతి, నగల మాయం తదితర అంశాలపై తెదేపా మహాధర్నా, పాదయాత్రను శనివారం తిరుపతిలో చేపట్టిన విషయం తెల్సిందే. ఈ మహాధర్నాలో చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రం తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. ఈ పవిత్రతను మంటగలిపేలా కొండపై అవినీతి జరుగుతోందన్నారు.

ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్.రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తిరుమల అపవిత్రంగా మారిందన్నారు. డబ్బులున్న వారికే శ్రీవారి దర్శన భాగ్యం లభిస్తోందన్నారు. మారుమూల పల్లె ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు దర్శనభాగ్యం లభించడం లేదన్నారు. ఈ పద్దతి మారి, ప్రతి ఒక్కరికీ దర్శనం కలిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

ఇక అధిష్టానంతో జగడమే: యువ ఎమ్మెల్యేల తీర్మానం!

తమ ప్రియతమ నేత దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు, కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం చర్య తీసుకోవడం తథ్యమనే సంకేతాలు ప్రస్ఫుటంగా వస్తున్నాయి. ఇప్పటికే జగన్ వర్గీయులపై చర్యలు చేపట్టిన హైకమాండ్ తదుపరి అస్త్రాన్ని ఏకంగా జగన్‌పైనే ప్రయోగించాలని నిర్ణయించినట్టు ఢిల్లీ వర్గాల సమాచారం.

'ముల్లును ముల్లుతోనే తీయాల'న్న చందంగా కాంగ్రెస్ హైకమాండ్ సంధించే అస్త్రాన్ని ధీటుగా ఎదుర్కునేందుకు జగన్ వర్గం సిద్ధమైంది. ఇందుకోసం మాజీ మంత్రి, శాయంపేట ఎమ్మెల్యే కొండా సురేఖ ఎంచుకున్న లేఖాస్త్రం మార్గానే ఎంచుకోనుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను వివరిస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు లేఖ రాయాలని మరికొంతమంది నేతలు నిర్ణయించారు.

అసెంబ్లీకి తొలిసారి ఎంపికైన యువ ఎమ్మెల్యేలలో సింహ భాగం జగన్ వైపుకు మొగ్గు చూపుతున్నారు. వీరంతా కొండా సురేఖ బాటను ఎంచుకోవాలని తీర్మానించినట్టు సమాచారం. కొంతమంది వృద్ధ నేతలు కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని, వీరికి చెక్ పెట్టి హైకమాండ్ కళ్లు తెరిపించేందుకు ఈ లేఖాస్త్రాలను సంధించాలని వారు నిర్ణయించారు. ఏది ఏమైనా.. కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాలు ముదిరి పాకాపడ్డాయని చెప్పవచ్చు.

Friday, August 6, 2010

మెగాస్టార్ రిఎంట్రీ ????



చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని బలోపేతం చేయాలన్న దిశలో ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మహిళలతోనూ, తన అభిమానులతోనూ సమావేశమయ్యారు. మహిళా కార్యకర్తలు అభ్యర్థనలను, ఆకాంక్షలను ఓపిగ్గా విన్నారు. మహిళల గొంతును ప్రజారాజ్యం పార్టీ సమర్థవంతంగా వినిపిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రోజురోజుకీ మహిళలపై జరుగుతున్న దుశ్చర్యలకు అడ్డుకట్ట వేయడం ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. మహిళా రక్షణకు ఉన్న చట్టాలను సమర్థవంతంగా అమలయ్యే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుక వస్తామన్నారు. అనంతరం అభిమానులతో చిరంజీవి సమావేశమయ్యారు. గత ఎన్నికల్లో తన ఫ్యాన్స్, యూత్ పవర్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేక పోయానని అన్నారు. ఈసారి మా ఫ్యాన్స్ టైగర్స్ తమ సత్తా ఏమిటో పీఆర్పీ ద్వారా నిరూపిస్తారని, ఇందుకోసం నిత్యం వారితో టచ్‌లో ఉంటానని చిరంజీవి పేర్కొన్నారు. ఆ సమయంలో ఫ్యాన్స్ ,"అన్నా.. నీ స్టెప్స్‌ను మళ్లీ చూడాలనిపిస్తోంది. సినిమా చేయవూ..." అంటూ నినాదాలు చేశారు. అభిమానుల ఉత్సాహానికి తగ్గట్టే చిరు ప్రతిస్పందించారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. అభిమానుల కోరిక అంత బలీయంగా ఉంటే... ఏమో.. చూద్దాం.. అన్నారు కానీ ఈ రోజు జరిగిన తమిళ సూపర్ స్టార్ రజిని కాంత్ రోబో ఆడియో విడుదల కార్య క్రమం లో అయన మాటలాడుతూ రోబో ట్రైలర్ చుసిన తరువాత నాకు శంకర్ డైరక్షన్ లో సినిమా కి అవకాశం వస్తే చేయాలనీ వుంది అంటూ అయన మనసులో మాట చేపకనే చెప్పారు ఏది ఏమైనా అభిమనుకు ప్రజలకు దాదాపు సందేహాలు తిరిపోయాయి

రామగోపాల్ వర్మ రక్త చరిత్ర

Thursday, August 5, 2010

The Last Shot

I took the last shot of ‘Rakht Charitra’ yesterday. From the inception of the idea of wanting to make ‘Rakht Charitra’ till the point of me taking the last shot was an incredible journey for both my mind the way it started perceiving and understanding the research material and then also how it studied the minds of the various involved parties. So a constant analysis and thereby a due course of me being psyched up by what kind of conclusive truths I have reached in various mental states of mine resulted in a situation that by the time I reached the last shot it made me truly believe that what I shot in Cinema is real and what happened in real was Cinema.

Wednesday, August 4, 2010

ప్రజాస్వామ్యమా.. కాంగ్రెస్‌లో నీవెక్కడా: అంబటి రాంబాబు

కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందో లేదో తెలియని సందిగ్ధావస్థలో తాము ఉన్నట్టు సస్పెండ్‌కు గురైన పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. ఎవరిని ఎందుకు తీసేస్తున్నారో వివరణ ఇచ్చుకోలేని స్థితిలో పెద్దలు ఉన్నారన్నారు. పార్టీ ప్రజాస్వామ్యం అంటే ఇదేనా ఆయన ప్రశ్నించారు.

ఆయన బుధవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ వామపక్షాల ఖిల్లాగా ఉన్న ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఐదు స్థానాలను అందించిన ఘనత రాజశేఖర రెడ్డికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడంలో తమతో పాటు అనేక మంది పార్టీ కార్యకర్తల సహకారం ఉందని అంబటి చెప్పుకొచ్చారు.

అయితే, ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా, పార్టీ శ్రేణులకు చెడు సంకేతాలను పంపేలా ఉన్నాయన్నారు. తనను సస్సెండ్ చేసినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి.. కానీ తనకు అధికారికంగా ఎలాంటి పత్రాలు అందలేదని గుర్తు చేశారు.

అలాగే, కాంగ్రెస్ అనుబంధ సంస్థ కిసాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి గట్టు రామచంద్రరావును తొలగించినట్టు తాజాగా వార్తలు వచ్చాయి. ఆయనకు కూడా స్పష్టమైన ఆదేశాలు అందలేదన్నారు. ఏది ఏమైనా.. కొంతమంది పెద్దలు అంటే ముఖ్యమంత్రి స్థాయి వంటి నేతల ఒత్తిడి, ప్రోద్భలంతోనే ఈ తరహా చర్యలు చేపడుతున్నారన్నారు.

ఇలాంటి చర్యలు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో మనుగడ సాగించేలా చేస్తాయా, వైఎస్.రాజశేఖర రెడ్డి, వైఎస్.జగన్మోహన్ రెడ్డి పేర్లను ప్రస్తావించకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగగలదా అని ప్రశ్నించారు. వైఎస్ జపం చేయడాన్ని నేరంగా భావించి తమపై కక్ష చేపడుతున్నట్టుగా ఉందన్నారు. ఏది ఏమైనా.. తమకు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత పెద్దలపై ఉందని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డా


ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న జగన్ వర్గీయులకు కాంగ్రెస్ అధిష్ఠానం తన పవర్‌ను క్రమంగా రుచి చూపిస్తోంది. నోటికి తాళాలు వేస్తోంది. కాంగ్రెస్‌లోనే ఉంటూ ఓవైపు "జై జగన్" అంటూనే మరోవైపు "వీక్ రోశయ్యా" అంటూ చెణుకులు విసురుతూ దూకుడు వ్యాఖ్యలు చేసిన అంబటిపై తొలి అస్త్రాన్ని సంధించిన కాంగ్రెస్ హైకమాండ్ తాజాగా కొండా సురేఖపై ఎక్కుపెట్టింది.

మహావృక్షంలాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన కొమ్మల్లాంటి నేతలను తొలగిస్తూ కాంగ్రెస్ పార్టీని బలహీన పరుస్తున్నారని కొండా సురేఖ తన 11 పేజీల సుదీర్ఘ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు రాష్ట్రంలో ఇపుడున్నది బహు బలహీనమైన నాయకత్వమనీ, అందువల్లనే కాంగ్రెస్ పార్టీ గందరగోళంలో కొట్టుమిట్టాడుతోందని తెలిపింది.

అన్నిటికీ మించి అసలు తాము స్వపక్షంలో ఉన్నామో విపక్షంలో ఉన్నామో అర్థంకాని అయోమయ స్థితిలో ఉన్నామని పేర్కొనడాన్ని కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఫలితంగానే కొండాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.

అధిష్ఠానం పంపిన షోకాజ్ నోటీసుకు ప్రజల మనోభావాలకు అనుగుణంగా వివరణ ఇచ్చుకుంటానని సురేఖ వెల్లడించింది. మరోవైపు రెండు రోజుల్లో అంబటి రాంబాబు క్రమశిక్షణా సంఘం ముందు తన వాదనలను సమర్థించుకోనున్నారు. అంబటి తాను ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను ఎలా సమర్థించుకుంటారో చూద్దామన్న ధోరణిలో హైకమాండ్ ఉన్నట్లు సమాచారం.

ఇదిలావుండగా పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఎవరు వ్యాఖ్యలు చేసినా వారిపై చర్య తప్పదని కాంగ్రెస్ హైకమాండ్ తన చర్యల ద్వారా హెచ్చరిస్తోంది. ప్రత్యేకించి జగన్ వర్గీయులను. ఈ సంగతి ఇలా ఉంటే బుధవారం జగన్ వర్గీయులందరూ అంబటి స్వగృహంలో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎలాగూ అధిష్టానం తమను టార్గెట్ చేస్తుంది కనుక భవిష్యత్తులో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై వారు కసరత్తు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

ఏదేమైనా జగన్ వర్గానికి వరుస షాక్‌లు ఇస్తూనే ఉన్నది కాంగ్రెస్ హైకమాండ్. మరోవైపు జగన్ కాకినాడ ఓదార్పు సభలో తన సహనం ఎన్నాళ్లు ఉంటుందో తనకే తెలియదని చెప్పారు. అలా చెప్పినప్పటికీ హైకమాండ్ జగన్ మాటలను పట్టించుకున్నట్లు ఏమీ కనబడటం లేదు. హద్దు మీరితే జగన్‌పైనా గురి పెట్టడం ఖాయమని తాజా సంఘటనలనుబట్టి అర్థమవుతోంది. మరి జగన్ సహనంగానే ఉంటారో... సహనం కోల్పోతారో చూడాలి.

కొండసురేఖ కు షోకాజ్ నోటీసు

మంత్రి కొండసురేఖ కు త్వరలో షోకాజ్ నోటీసు లు జారి చేస్తామని పీ సి సి పరిశీలన ,దరియప్తు సంఘం కమిటి చైర్మన్ కంతేటి సత్యనారాయణ రాజు మీడియా కు తెలిపారు అయితే ఈ విషయం అయన అధికారికంగా వివరించలేదు అంబటి రాంబాబు వాదన లు కూడా వింటామని అయన తెలిపారు రోశయ్య తో అయన సమవేసమయిన సందర్బం గా మీడియా తో మాటలాడరు .ఇది జగన్ కు వెతిరేక౦ గా కొందరు కుట్ర పన్నుతునారని మరి కొంత మంది వాదన వై ఎస్ ఆర్ అభిమానులను పార్టీ నుంచి తప్పించే ప్రయత్నం అని కొందరు అభిప్రాయపడుతున్నారు అదే ఎం అయ్యిన జగన్ ప్రజాదరణ వుంది అని కాబట్టి జగన్ కు నష్టం లేదు అని జగన్ వర్గం స్పష్టం చేస్తోంది .వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ లో ఆధిపత్యపోరు మరియు సమన్వయలోపం స్పష్టం గా కనిపిస్తునాయి ఇలాగే కొనసాగితే భావిస్యతు లో కాంగ్రెస్ కు తిప్పలు తప్పవు

Tuesday, August 3, 2010

రాజకీయ సంక్షోభం వస్తే ఆదుకుంటా: చిరు అభయ హస్తం


రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజుకో విధంగా మారిపోతున్న నేపధ్యంలో ఒకవేళ రాజకీయ సంక్షోభం తలెత్తితే ప్రజలపై భారం పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రజారాజ్యం పార్టీపై ఉన్నదని ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. అలా చెప్పడం ద్వారా కాంగ్రెస్ సర్కార్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కూలనివ్వబోనన్న దృఢ సంకల్పంతో చిరు ఉన్నట్లు అర్థమవుతోంది.

ఇటీవల రాజ్యసభ ఎన్నికల సమయంలో సోనియా గాంధీతో సమావేశమైన తర్వాత నుంచి చిరంజీవి క్రమంగా కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా మెలగుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలోనూ రోశయ్యకు చేదోడు వాదోడుగా ఉంటూ దాదాపు కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి మద్దతు పలుకుతున్నారు.

అయితే అప్పుడప్పుడు కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై ధ్వజమెత్తుతున్నారు. తాజాగా బార్‌ల ఏర్పాటు విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. జనభా ప్రాతిపదికన పాఠశాలలు, ఆస్పత్రులు ఏర్పాటు చేయకుండా బార్లను ఏర్పాటు చేయడం శోచనీయమని చిరు ఆవేదన వ్యక్తం చేశారు.

మొత్తమ్మీద చిరంజీవి చాలా త్వరగానే రాజకీయ క్రీడలను ఆకళింపు చేసుకున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.