Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Saturday, July 31, 2010

డీఎస్... మీ సారథ్యం చాలు.. ఇక తప్పుకోండి: కాకా



తెలంగాణ ఉప ఎన్నికల ఫలితాలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ డీఎస్ రాజీనామా చేయాలనే విమర్శలు నలువైపులా వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వృద్ధ నేతలే ఈ తరహా డిమాండ్ చేస్తున్నారు. దీంతో డీఎస్కు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

శుక్రవారం వెలువడిన 12 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి పోటీ చేసిన డీఎస్ భాజపా అభ్యర్థి లక్ష్మీనారాయణ చేతిలో వరుసగా రెండోసారి చిత్తుగా ఓడిపోయారు.

పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న డీఎస్ వరుసగా ఓడి పోవడాన్ని కాంగ్రెస్ శ్రేణులకు ఏమాత్రం రుచించడం లేదు. కనీసం తన సొంత జిల్లాలో కూడా గెలువలేని నేత.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బాధ్యతలను ఎలా నిర్వహిస్తారని వృద్ధ నేతలతో పాటు యువ ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు.

ప్రధానంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నేతలు ఈ తరహా డిమాండ్ చేయడం డీఎస్కు రుచించడం లేదు. అలాగే, ఈ విమర్శలపై డీఎస్ పెదవి విప్పడం లేదు. అలాగే, కాంగ్రెస్ అధిష్టానం మదిలో ఎలాంటి వ్యూహాలు ఉన్నాయో కూడా అంతుచిక్కడం లేదు. మొత్తం మీద డీఎస్కు పదవీ గండం పొంచివుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

0 comments:

Post a Comment