ఉప ఎన్నికల్లో విజయభేరీ మోగించిన తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు మళ్లీ రాజీనామా చేస్తారేమోననే సందేహాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ సందేహం వ్యక్తం చేశారు. ఈ విజయ గర్వంతో మరోమారు రాజీనామాలు చేస్తే ప్రజలు తగిన బుద్ధిచెపుతారని ఆయన జోస్యం చెప్పారు.
శుక్రవారం వెలువడిన 12 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలపై ఆయన హైదరాబాద్లో స్పందిస్తూ తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకోవాలన్నారు. ప్రత్యేక తెలంగాణ కావాలన్న ఆకాంక్ష ఆ ప్రాంత ప్రజలు ఓట్ల రూపంలో వ్యక్తం చేశారన్నారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం తమ పదవులను త్యాగం చేసి తెలంగాణ కోసం పోరాడుతున్నారనే సానుభూతితో అభ్యర్థులను ప్రజలు గెలిపించారనే భావన వారిలో నెలకొందన్నారు. అందువల్లే ఘన విజయం సాధించారన్నారు. అయితే, భవిష్యత్లో తెరాస సభ్యులు నేతలు రాజీనామాల బాట పట్టకుండా తెలంగాణ ఉద్యమంపైనే దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
14 years ago







0 comments:
Post a Comment