
ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసేందుకు గాను రాజకీయ కుట్ర సాగుతోందని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఈ కుట్రలో తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలు పాలు పంచుకుంటున్నాయని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
ఆయన శనివారం వరంగల్‌లో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ముసుగులో తెదేపాపై రాజకీయ కుట్ర సాగుతోందన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం అధికార పార్టీని వదిలి వేసి తమను ప్రశ్నించడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. తాజాగా వెల్లడైన ఫలితాలు తెలంగాణ ప్రజల విజయంగా ఆయన అభివర్ణించారు.
ఇకపోతే.. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో బీటెక్ విద్యార్థి ఇషాన్ రెడ్డి ఆత్మహత్యపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం విద్యార్థులెవ్వరూ ఆత్మబలిదానాలు చేసుకోవద్దని ఎర్రబల్లి విజ్ఞప్తి చేశారు.
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
14 years ago







0 comments:
Post a Comment