Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Saturday, July 31, 2010

తెదేపాకు వ్యతిరేకంగా రాజకీయ కుట్ర: ఎర్రబెల్లి దయాకర్


ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసేందుకు గాను రాజకీయ కుట్ర సాగుతోందని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఈ కుట్రలో తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్‌ పార్టీలు పాలు పంచుకుంటున్నాయని ఆయన సందేహం వ్యక్తం చేశారు.

ఆయన శనివారం వరంగల్‌లో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ముసుగులో తెదేపాపై రాజకీయ కుట్ర సాగుతోందన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం అధికార పార్టీని వదిలి వేసి తమను ప్రశ్నించడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. తాజాగా వెల్లడైన ఫలితాలు తెలంగాణ ప్రజల విజయంగా ఆయన అభివర్ణించారు.

ఇకపోతే.. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో బీటెక్ విద్యార్థి ఇషాన్ రెడ్డి ఆత్మహత్యపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం విద్యార్థులెవ్వరూ ఆత్మబలిదానాలు చేసుకోవద్దని ఎర్రబల్లి విజ్ఞప్తి చేశారు.

డీఎస్... మీ సారథ్యం చాలు.. ఇక తప్పుకోండి: కాకా



తెలంగాణ ఉప ఎన్నికల ఫలితాలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ డీఎస్ రాజీనామా చేయాలనే విమర్శలు నలువైపులా వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వృద్ధ నేతలే ఈ తరహా డిమాండ్ చేస్తున్నారు. దీంతో డీఎస్కు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

శుక్రవారం వెలువడిన 12 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి పోటీ చేసిన డీఎస్ భాజపా అభ్యర్థి లక్ష్మీనారాయణ చేతిలో వరుసగా రెండోసారి చిత్తుగా ఓడిపోయారు.

పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న డీఎస్ వరుసగా ఓడి పోవడాన్ని కాంగ్రెస్ శ్రేణులకు ఏమాత్రం రుచించడం లేదు. కనీసం తన సొంత జిల్లాలో కూడా గెలువలేని నేత.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బాధ్యతలను ఎలా నిర్వహిస్తారని వృద్ధ నేతలతో పాటు యువ ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు.

ప్రధానంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నేతలు ఈ తరహా డిమాండ్ చేయడం డీఎస్కు రుచించడం లేదు. అలాగే, ఈ విమర్శలపై డీఎస్ పెదవి విప్పడం లేదు. అలాగే, కాంగ్రెస్ అధిష్టానం మదిలో ఎలాంటి వ్యూహాలు ఉన్నాయో కూడా అంతుచిక్కడం లేదు. మొత్తం మీద డీఎస్కు పదవీ గండం పొంచివుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ అంశం సర్వరోగ నివారిణి కాదు: జయప్రకాష్


రాష్ట్ర విభజనపై నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ అంశం సర్వరోగ నివారిణి కాదని లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఉప ఎన్నికల్లో ఓటర్లను డబ్బు, మద్యం వంటి అంశాలు ఓటర్లను ఏమాత్రం ప్రభావితం చేయలేదన్నారు. అదేసమయంలో ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నారని, అందువల్ల ప్రస్తుతం తెలంగాణ అంశంపై స్పందించడం మంచిది కాదన్నారు.

ఇకపోతే.. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుపై ఆయన స్పందిస్తూ రాష్ట్రాభివృద్ధిలో పారిశ్రామికీకరణ అతి ముఖ్యమన్నారు. ఇందుకోసం స్థాపించే ప్రాజెక్టులు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉండరాదన్నారు. రాష్ట్రంలో గ్యాస్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యంగా, ఇక్కడ రైతుల పంట పొలాల్లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును నిర్మించి, అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ను ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తామంటే ఎవరు మాత్రం అంగీకరింస్తారన్నారు. అందువల్ల ఇలాంటి ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చే ముందు అన్ని అంశాలపై ప్రభుత్వం కూలంకుషంగా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Friday, July 30, 2010

వీళ్లు మళ్లీ రాజీనామా చేస్తారేమో????? నారాయణ సందేహం



ఉప ఎన్నికల్లో విజయభేరీ మోగించిన తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు మళ్లీ రాజీనామా చేస్తారేమోననే సందేహాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ సందేహం వ్యక్తం చేశారు. విజయ గర్వంతో మరోమారు రాజీనామాలు చేస్తే ప్రజలు తగిన బుద్ధిచెపుతారని ఆయన జోస్యం చెప్పారు.

శుక్రవారం వెలువడిన 12 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలపై ఆయన హైదరాబాద్లో స్పందిస్తూ తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకోవాలన్నారు. ప్రత్యేక తెలంగాణ కావాలన్న ఆకాంక్ష ప్రాంత ప్రజలు ఓట్ల రూపంలో వ్యక్తం చేశారన్నారు.

ప్రత్యేక రాష్ట్రం కోసం తమ పదవులను త్యాగం చేసి తెలంగాణ కోసం పోరాడుతున్నారనే సానుభూతితో అభ్యర్థులను ప్రజలు గెలిపించారనే భావన వారిలో నెలకొందన్నారు. అందువల్లే ఘన విజయం సాధించారన్నారు. అయితే, భవిష్యత్లో తెరాస సభ్యులు నేతలు రాజీనామాల బాట పట్టకుండా తెలంగాణ ఉద్యమంపైనే దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు

రాములమ్మ జోస్యం




గత సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ గల్లంతైందని... ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా నేత, మెదక్ ఎంపీ విజయశాంతి జోస్యం చెప్పారు. ఎన్నికల ఫలితాలపై ఆమె స్పందిస్తూ.. ఉప ఎన్నికలు జరిగిన 12 సెగ్మెంట్లలో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులకు ధరావత్తు గల్లంతైందని ఆమె గుర్తు చేశారు.

ముఖ్యంగా, సమైక్యాంధ్ర బాట పట్టిన ప్రజారాజ్యం పార్టీ తెలంగాణ ప్రాంతంలో పూర్తిగా తుడిసి పెట్టుకుని పోయిందన్నారు. రెండు ప్రాంతాలు రెండు కళ్లతో సమానమన్న తెదేపా పూర్తిగా భూస్థాపితమయ్యే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయన్నారు. ఇప్పటికైనా అధికార కాంగ్రెస్ పార్టీ మేల్కొని తెలంగాణకు జైకొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.

ప్రజల తాజా తీర్పు సీమాంధ్ర నేతలకు కనువిప్పు కావాలన్నారు. అందువల్ల వీరంతా ఏకమై తెలంగాణ వచ్చేలా చూడాలన్నారు. లేనిపక్షంలో తెలంగాణ గడ్డపై ఉన్న సీమాంధ్ర ప్రజానీకానికి ఈ ప్రాంత ప్రజలు పెట్టేబేడా చేతికి ఇచ్చి పంపే సమయం వస్తుందని విజయశాంతి జోస్యం చెప్పారు.

ఇక తెలంగాణాను ఆపటం ఎవరి తరం కాదు: కేసీఆర్


ఉపఎన్నికల్లో తెలంగాణా ప్రజలు తమ గుండెల్లోని ఆకాంక్షను చీల్చి బయటకు తెచ్చి తెరాసకు ఓట్లుగా మలిచారనీ, ఇక తెలంగాణా రాష్ట్రాన్ని ఆపటం ఎవరి తరమూ కాదని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. రాష్ట్ర విభజన జరిగే వరకూ తెలంగాణా ప్రజలు ఇదే స్ఫూర్తితో ఉండాలని పిలుపునిచ్చారు.

తెలంగాణాలో తెరాస సాధించిన భారీ విజయాన్ని తెలుసుకుని ప్రపంచంలోని 18 దేశాలలో ఉన్న తెలంగాణా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారని కేసీర్ అన్నారు. అమెరికాలో శెలవు దొరకకపోయినా, ప్రత్యేకించి సంబరాలు చేసుకునేందుకు బలవంతంగా శెలవు పెట్టి పార్టీ చేసుకుంటున్నట్లు వారు తనతో చెప్పారన్నారు.

తమ గెలుపును అడ్డుకునేందుకు కాంగ్రెస్ - తెలుగుదేశం మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాయన్నారు. ఈ దగాకోరు పార్టీలు ఎన్ని ఎత్తులు వేసినా తెలంగాణా ప్రజలు వారి చెంప ఛెళ్లుమనిపించేలా, కళ్లు గిర్రున తిరిగేలా, ఢిల్లీ పీఠానికి వినబడేలా తమ తీర్పునిచ్చారన్నారు. ఈ గెలుపుకు కృషి చేసిన విద్యార్థులు, న్యాయవాదులు, డాక్టర్లు, ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు మా తెలంగాణా అక్కాచెల్లెళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

ఇక మీడియా బాసులు ఇబ్బందిపెట్టినా తమ ఎన్నికల పర్యటనల గురించి పేపర్లలో వచ్చేటట్టు తెలంగాణా జర్నలిస్టులు పాటుపడ్డారనీ, అందుకుగాను వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ గెలుపు తెరాసది కాదనీ, నాలుగు కోట్లమంది తెలంగాణా ప్రజలదని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

ఇప్పటికైనా ప్రధాని మన్మోహన్, సోనియా గాంధీలు ఈ ఎన్నికలను ఓ రెఫరెండంగా తీసుకుని రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక శ్రీకృష్ణ కమిటీ తెలంగాణాలో పర్యటించకుండానే ఇక్కడి ప్రజలు ఈ గెలుపుతో ఏకగ్రీవంగా నివేదిక ఇచ్చారని తెలిపారు. కనుక కేంద్రం ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు

Sunday, July 25, 2010

Wednesday, July 21, 2010

జగన్ తో జనం

మహా నేత తనయుడు వై ఎస్ ఆర్ జిల్లా M.P వై.ఎస్ జగన్ కు బ్రహ్మరధం పడుతున్న జనం ఎండ వాన అని తేడ కూడా లేకుండా అడుగడుగునా జగన్ కు ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా లో ఈ నెల 24 వరకు యాత్ర కొనసాగే అవకాశాలు వున్నాయి

TDP DHARNA @ ASSEMBLY

Tuesday, July 20, 2010

CHANDRA BABU NAIDU BACK TO ANDHRA

తోకముడిచిన మహారాష్ట్ర సర్కార్

తోకముడిచిన మహారాష్ట్ర సర్కార్ ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబునాయుడు మరియు ఆ పార్టీ కి చెందిన ఎం పీ లు mla ల పై పెట్టిన కేసులను ఉపసంహరించు కున్న మహారాష్ట్ర సర్కార్ మరి కాసేపటిలో వారిని విడుదల చేస్తారు ప్రత్యేక విమానం లో వారిని హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేస్తున్నారు

మహా కావరం



తెలుగుదేశం పార్టీ నేతల పై మహారాష్ట్ర పోలీసుల ఝులుం శాసన సభ్యులు అని చూడకుండా కనీస మర్యాద కూడా లేకుండా విచక్షణా రాహిత్యం గా కొట్టిన ఖాకీలు ఇది ప్రజాస్వామ్యమ ఎఖ దాటిగా 9 సంవత్సరాలు ముఖ్య మంత్రి గా పనిచేసిన చంద్రబాబు నాయుడు పై కూడా పోలీసుల ఝులుం .మేము భిక్షగాలం కాదు మమ్మల్ని మీరు తీవ్రవాదు ల కన్నా హీనం గా చుస్తునారు అంటూ అయన ఆవేదన వ్యక్తం చేసారు .మరోపక్క ఇది చాతకాని ప్రభుత్వం అని ఆ పార్టీ సేనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు .ఇది ఒక్కరి సమస్య కాదు అని మొత్తం తెలుగు జాతి ఆత్మ గౌరవ సమస్య అని ప్రముఖ హీరో మంచు మోహన్ బాబు అన్నారు పదివేల మంది విద్యార్దు లతో అయన తిరుపతి లో భారి రాలీ నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికయినా కళ్ళు తెరవాలి తెలంగాణా రాష్ట్ర సమితి మాత్రం ఇది చంద్రబాబు కావాలని చేస్తున్నారు అని ఇది కేవలం రాజకీయ యాత్ర అని విమర్శించింది . చంద్రబాబు కు ప్రజారాజ్యం ,సి పీ ఐ, ఇంకా అనిపక్షాలు మదతు పలికాయి మాజీ ప్రధాని దేవగౌడ కూడా మదతు పలికారు .కానీ తెలంగాణా రాష్ట్ర సమితి ఇప్పటి వరకు చంద్రబాబు పై జరగిన దాడి ని ఖండించకపోవడం విశేషం

Monday, July 19, 2010

MAHARASHRA POLICE CRUEL BEHAVIOUR