Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Monday, February 28, 2011

Allu Arjun Wedding Invitation FOR FANS


Friday, February 25, 2011

మన TV9 మేరుగు అయ్యిన సమాజం కోసం పని చేస్తోందా ????

మన TV9 మేరుగు అయ్యిన సమాజం కోసం పని చేస్తోందా ?రేటింగ్  కోసం పని చేస్తోందా? జర్నలిజం గురించి వాటి విలవల గురించి హక్కుల గురించి  మాటలు ఆడే TV9 వాటి విలువలు పాటిస్తోందా  ఒక అప్పుడు TV9 అంటే జనాలు ఇష్టపడే వారు ?కానీ ఇప్పుడు  ప్రజలు ఏమంటున్నారు  TV9 గురించి  ప్రజల స్పందన ఏమిటి http://amplicate.com/hate/tv9
TV9 ని అభినందించే వారు ఇష్ట పడేవారికీ  కూడా ఈ మధ్య ఆ ఛానల్ పట్ల ఆసేక్తి తగ్గింది దానికి కారణం ఆ ఛానల్ అనవసరం మయిన చర్చలు పెట్టడం వల్ల .
TV9 బాధ్యత గా వుందా ? మనం ఒకరికి సహాయం చేసేటప్పుడు మన పేరు కన్నా సహాయం ముఖ్యం అని ఆలోచన చేయాలి ముఖ్యం గా వరదలు వచినప్పుడు మన బ్రాండ్ నేమ్ ప్రోమోట్ చేయడం ముఖ్యం కాదు 
ఎవరో హీరో కూతురు పెళ్లి చేసుకుటే ఆ పెళ్లి గురించి ఆ రోజు అంత మనం ఆ ప్రోగ్రాం వేసి ఆ ఇంట్లో వాళ్ళ పరువును దిగజార్చడం జర్నలిజం ఆ ??? వర్మ జీవితం గురించి  వర్మ రక్తచరిత్ర సినిమా గురించి ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మనం CRIMEWATCH ప్రోగ్రాం చేయకూడదు కల్పిత పాత్రలు అని రాసి మరి చూపిస్తాం ఇది సమాజానికి అవసరమా ? ఇలాంటి కార్యక్రమాలు చూసి తప్పుచేసిన వాళ్ళు ఎలా తప్పించు కోవాలోతెలుసు కుంటున్నారు ఒక వ్యక్తి మరణిస్తే EXCLUSIVE FIRSTON TV9 అని వస్తుంది ఒకరి విషాదం ఒకరి బాధ ను మనం ఆ విధం గా చూపించ వచ్చునా ఇది ఏ రకమయిన జర్నలిజం రాంగోపాల్ వర్మ సినిమాల గురించి రాంగోపాల్ వర్మ  గురించి గంటల గంటలు చర్చలు అవసరమా  TV9 వచ్చిన కొత్త లో తప్పు చేయాలి అంటే భయం కానీ ఇప్పుడు డబ్బ్లు ఇస్తే న్యూస్ చూపించరు అనే విధం గా తాయారు అయ్యింది 














ఇలాంటి కార్యక్రమలు చూపించడమే మెరుగైన సమాజమా

Tuesday, February 22, 2011

2011-12 వార్షిక బడ్జెట్ రూ.1,28,542 కోట్లు


రాష్ట్ర ప్రభుత్వం 2011-12 సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళిక బడ్జెట్‌కు రూ.1,28,542 కోట్లు కేటాయించింది. బడ్జెట్ కేటాయింపుల వివరాలు :

బడ్జెట్ వార్షిక ప్రణాళిక - రూ.1,28,542 కోట్లు
ప్రణాళిక వ్యయం - రూ.47,558 కోట్లు
ప్రణాళికేతర కేటాయింపులు - రూ.80,984 కోట్లు
రెవెన్యూ మిగులు అంచనా - రూ.3,826 కోట్లు
ద్రవ్యలోటు అంచనా రూ. 17,602 కోట్లు
జీడీపీ అంచనా 8.5 శాతం
పరిశ్రమల వృద్ధి 9,.61 శాతంగా అంచనా

సాగునీటి రంగానికి - రూ.15వేల కోట్లు
జలయజ్ఞం రూ.15,010 కోట్లు
ఉన్నతవిద్య - రూ.3,337 కోట్లు
ఆరోగ్యం - రూ.5,040 కోట్లు
సాంఘిక సంక్షేమం -రూ.2,352 కోట్లు
బీసీ సంక్షేమం - రూ. 2,104 కోట్లు
మైనార్టీ సంక్షేమం - రూ.3001 కోట్లు
రాయితీ బియ్యం - రూ.2,500 కోట్లు
పరిశ్రమల శాఖ - రూ.858 కోట్లు

సమాచార సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్లు శాఖ రూ. 51 కోట్లు
ప్రాథమిక విద్యకు - రూ. 14, 025 కోట్లు
కార్మిక ఉపాధి - రూ. 489 కోట్లు
రహదారులు, భవనాలు శాఖ రూ. 4,108 కోట్లు
గృహ నిర్మాణం - రూ. 2,300 కోట్లు
మహిళా శిశు సంక్షేమ శాఖ - రూ. 1948 కోట్లు
గ్రామీణాభివృద్ధి - రూ. 3,341 కోట్లు
పట్టణాభివృద్ధి - రూ. 5,080 కోట్లు
సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ - రూ.100 కోట్లు
నియోజకవర్గ అభివృద్ధి కార్యకమం - రూ.385 కోట్లు

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం - రూ.400 కోట్లుతో ప్రత్యేక నిధి
మౌలిక సదుపాయాలు పెట్టుబడులకు రూ.143 కోట్లు
ఇంధన శాఖకు - రూ.4,980 కోట్లు
రెండు రూపాయల బియ్యానికి - రూ. 2,500 కోట్లు
ఆర్టీసీకి - రూ.200 కోట్లు
పాడి పరిశ్రమకు - రూ.930 కోట్లు

మిక్కిలినేని మృతి


స్వాతంత్య్ర సమరయోధులు, సుప్రసిద్ధ రంగస్థల-సినీనటులు, ప్రజానాట్యమండలి వ్యవస్థాపక సభ్యులు డాక్టర్‌ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (95) మంగళవారం ఉదయం విజయవాడలో కన్నుమూశారు. మిక్కిలినేనిగా చిరపరిచితులైన ఆయన కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. భార్య సీతారత్నం ఒకనాటి ప్రజానాట్యమండలి కళాకారిణి. ఆమె ఇప్పుడు లేరు. కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. కుమారుడు డాక్టర్‌ విజయకుమార్‌ వైద్యరంగంలో స్థిరపడ్డారు.
గుంటూరు జిల్లాలో కోలవెన్ను మండలం లింగాయపాలెంలో 1918లో జన్మించారు. తండ్రి అకాల మరణంతో బాల్యం అనేక కష్టాలకి ఎదురీదాల్సి వచ్చింది. చిన్నప్పట్నుంచీ పెంచుకున్న జానపద కళాతృష్ణ దృఢంగా వేళ్లూనుకుంది. కళారూపాలను తన స్మృతిపథంలో పదిలపరుచుకున్నారు. జానపదులంటే ఆయన దృష్టిలో మట్టి మనుషులు. అందుకే వారి కళావైభవ పరిరక్షణను జీవిత లక్ష్యంగా స్వీకరించారు. పదిహేనో ఏట గాంధీజీ పిలుపునందుకొని సాతంత్య్రోద్యమంలోకి దూకారు. బందరు మండలం చిన్నాపురంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సొంతూరు పునాదిపాడులో రావిచెట్టు మీద జెండా ఎగరవేశారు. విదేశీ వస్త్రాలు తగులబెట్టారు. ఖద్దరు కట్టి, జెండా చేతబట్టి 'కొల్లాయి కట్టితేనేమి, మా గాంధీ కోమటై పుట్టితేనేమి' అంటూ కంఠమెత్తి జాతీయ గీతాలను ఆలపించి యువజనులనూ, ప్రజలనూ ఉత్తేజపరిచి ఉర్రూతలూగించారు.
భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, రాజగురు ఆత్మబలిదానానికి స్ఫూర్తి చెంది కాంగ్రెస్‌ రాజకీయాలకు స్వస్తి చెప్పి 1938లో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు. నిషేధిత ''వందేమాతరం'', ''స్వతంత్రభారత్‌'' పత్రికలకు కొరియర్‌గా ఉండి ఊరూరా పంచారు. 1948లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఉప్పులూరు రైల్వేస్టేషన్‌ను, పునాదిపాడు హైస్కూలును తగులబెట్టాడని తీవ్రంగా కొట్టి, కేసు బనాయించి జైలుకు పంపారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో 'ముందడుగు', 'మాభూమి' వంటి నాటకాలు ప్రదర్శించినందుకు వాటిని నిషేధించారు. మాభూమి నాటకాన్ని ప్రదర్శించినందుకు ఆయన్ను రెండుసార్లు జైల్లో పెట్టారు. జిల్లా యువజనోద్యమం, బాల సంఘాల నిర్మాణం, గ్రంథాలయోద్యమం, గోరాగారి నాస్తికోద్యమం వంటి ఎన్నో ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి వ్యవస్థాపకునిగా రాష్ట్ర దళం ద్వారా శిక్షణాలయాలు నడిపారు. శాఖలను స్థాపించారు. నాటిరోజుల్లో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను, ప్రజానాట్యమండలి కళాకారులను ప్రభుత్వం తీవ్ర చిత్రహింసల పాల్జేసింది. ఆ సమయంలో పలువురు రంగస్థల కళాకారులను సినీ రంగం ఆహ్వానించింది. ఆ విధంగా 1951లో చలన చిత్రరంగంలో ప్రవేశించారు.
మిక్కిలినేని సినిమాల్లోకి ప్రవేశించేనాటికి రంగస్థలంలో మినహా సినీనటనలో ఏమాత్రం అనుభవం లేదు. అయితేనేం పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక చిత్రాలన్నిటిలోనూ విభిన్న పాత్రలు పోషించారు. ఆయన తాను నటించే పాత్ర గురించి లోతుగా అధ్యయనం చేసేవారు. ఈ విషయమే ఆయనెప్పుడూ అంటుండేవారు. పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక చిత్రాల సంభాషణలు వేరు, వేషధారణ వేరు. ఆ రోజుల్లో సంభాషణలు ముందే చేతికిచ్చేవారు. వాటికి తగిన అభినయం చేయాల్సి వచ్చేది. తీసుకున్న పాత్ర గురించి ఆయన అధ్యయనం చేసేవారు. నటీనటులు ఇప్పటిలాకాక ఆ రోజుల్లో ఎవరి సంభాషణలు వారే పలికేవారు. ప్రత్యేకించి మొహంలో అభినయం చూపించాల్సి వచ్చేది. అందువల్ల ఇంటి వద్ద రిహార్సల్స్‌ తప్పనిసరి. కనుకనే ఆయన పాత్రోచితంగా పోటీపడి నటించేవారు. పౌరాణిక పాత్రల్లో నటించడానికి ఎన్‌టిఆర్‌ మహాభారతాన్నే చదివారని ఆయన చెబుతుండేవారు.
సాధారణ నటుడికీ, కళాకారుడికీ వయస్సు రీత్యా కృషి ఆగిపోయేచోట మిక్కిలినేని అసలు జీవితం ప్రారంభమైంది. ఇంతకాలం నడిచిన జీవితానికీ, సినిమా జీవితానికీ వచ్చిన మార్పును గమనించి తాను ఏ ఆశయం కోసం తపన పడ్డానో అది మూలన పడిందని వ్యథ చెందారు. ప్రారంభ దినాల్లో సినీ బతుకు అంతంతమాత్రంగానే సాగింది. మిగిలిన కాలాన్ని ఎలా ఉపయోగించాలా అనే తపనతో సతమతమయ్యారు. అణగారిపోయిన నాటకరంగం, చితికి జీర్ణమైపోతున్న జానపద కళారూపాలు, దేశ సంస్కృతికి జీవితాన్నర్పించిన కళాకారుల గురించీ, ఒకనాడు నాటకరంగంలో వైభవంగా వెలిగిన నాటి నటరత్నాలు ఏమయ్యారనే తపనతో, కాలం కర్పూరంలా కరిగిపోకూడదనే బాధతో గ్రంథరచనకు పూనుకున్నారు. ఆ విధంగా ''నూరేళ్ల తెలుగు నాటకరంగం చరిత్ర''ను వేయి పేజీల గ్రంథంగా రచించారు. కాలగర్భంలో కలిసిపోయిన 400 మంది నటరత్నాల జీవితాల గురించి 'నటరత్నాలు' పేరిట 800 పేజీల గ్రంథం రాశారు. పలు సాంస్కృతిక సంస్థలకు గౌరవాధ్యక్షులుగా, సలహాదారునిగా పనిచేశారు. 1982లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ''కళాప్రపూర్ణ'', ''గౌరవ డాక్టరేట్‌'' పొందారు. ఎన్టీఆర్‌ ఆత్మ గౌరవ అవార్డు, సంగీత నాటక, అకాడమీ అవార్డులను సొంతం చేసుకున్నారు. వయోభారం, అనారోగ్యం సహకరించకపోయినప్పటికీ ఆయన ప్రజానాట్యమండలి, తదితర ప్రగతిశీల కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకునేవారు.
తాను రాసిన 'ఆంధ్రనాటకరంగ చరిత్ర' గ్రంథాన్ని అక్కినేని నాగేశ్వరరావుకూ, ఎన్‌టి రామారావుకూ అంకితమిచ్చారు. ఆ సందర్భంగా 'నేను నాటక రంగం నుంచి సినిమా రంగానికొచ్చాను. దానికి నేనేమీ చేయలేకపోయాను. ఈ రంగానికి మీరు ఎంతో కృషి చేస్తున్నారు. నాటక రంగం రుణం తీర్చుకుంటున్నారు. మీ ఆంధ్ర నాటక రంగ చరిత్ర గ్రంథాన్ని ముద్రించి నా నాటక రంగ తల్లి రుణం తీర్చుకుంటాను' అని అక్కినేని వ్యాఖ్యానించారు. ఆ తరువాత మిక్కిలినేని చేతి నుంచి ఎన్నో గ్రంథాలు వెలువడ్డాయి. ఆ విధంగా మిక్కిలినేనిని నాటకరంగ పరిశోధకుడిగా చెప్పవచ్చు.
47 ఏళ్లపాటు సినీరంగంలో ఆయన చేసిన సేవలు మరిచిపోలేనివి. నమ్మిన కమ్యూనిస్టు ఆశయాలకూ, క్రమశిక్షణకూ, ఆత్మవిమర్శకూ నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.
* 300కుపైగా చిత్రాల్లో జనరంజకమైన పాత్రల్ని పోషించారు. మొదటి చిత్రం 'దీక్ష' 1949లో విడుదలైంది. స్వర్గీయ ఎన్‌.టి.ఆర్‌. ప్రోత్సాహంలో పలు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో తండ్రిగా, గురువుగా, కుటుంబపెద్దగా...పలు పాత్రలు పోషించారు. పల్లెటూరు, కన్నతల్లి, తెనాలి రామకృష్ణ, మాయాబజార్‌, గుండమ్మకథ, దానవీరశూరకర్ణ, పల్నాటియుద్ధం మొదలైన చిత్రాల్లో అనేక పౌరాణిక పాత్రలు వేశారు. ఆయన నటించిన చివరిచిత్రం బాలకృష్ణ హీరోగా చేసిన 'భైరవద్వీపం'(1992). అత్యధిక సంఖ్యలో పౌరాణిక పాత్రలు వేసిన నటుడిగా ఆయన్ని చెప్పుకొవచ్చు. దుర్యోధనుడు, దుశ్సాసనుడు, కర్ణ, ధర్మరాజు, దృతరాష్ట్రుడు, భీష్ముడు, బలరాముడు, జనక, ఇంద్ర, బ్రహ్మ...మొదలైన అనేక పాత్రల్లో తెరపై కనిపించి అలరించారు.
* దాదాపు 40 రకాల పౌరాణిక పాత్రల్ని వేసిన ఏకైక నటుడిగా ఇండిస్టీలో ఆయన్ని గుర్తు చేసుకుంటారు. 1999లో శ్రీపొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు 'విశిష్టపురస్కారం'తో సత్కరించి గౌరవించింది. గత ఏడాది అమెరికాలోని తెలుగు మహాసభలకు 
హాజరయ్యారు

source :cv

Allu Arjun Wedding Invitation




CLICK ON THE ABOVE THUMBNAILS FOR LARGE SIZE

Sunday, February 6, 2011

కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీ విలీనం



న్యూఢిల్లీ: ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ ప్రకటించారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి చర్చలు ముగిశాయి. 10 జనపథ్'లోని ఆమె నివాసంలో జరిగిన ఈ చర్చలలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీ విలీనంపై చర్చిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కూడా వారు చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు వీరప్ప మొయిలీ, ఎకె ఆంటోనీలతోపాటు పీఆర్పీ నేత సి.రామచంద్రయ్య పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం చిరంజీవి, వీరప్ప మొయిలీ విలేకరులతో మాట్లాడారు.

సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నట్లు చిరంజీవి తెలిపారు. విలీనంలో వ్యక్తిగత ప్రయోజనాలు లేవని ఆయన చెప్పారు. తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అన్నారు. పోలవరానికి జాతీయ హోదా, రైతులకు ప్యాకేజీ విషయంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను సోనియా గాంధీ వద్ద ప్రస్తావించినట్లు తెలిపారు.

ఈ రోజు నుంచి చిరంజీవి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడని వీరప్ప మొయిలీ చెప్పారు. పీఆర్పీ విలీనంతో కాంగ్రెస్ బలం పెరుగుతుందన్నారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఆస్థి అన్నారు.