Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Sunday, February 6, 2011

కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీ విలీనం



న్యూఢిల్లీ: ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ ప్రకటించారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి చర్చలు ముగిశాయి. 10 జనపథ్'లోని ఆమె నివాసంలో జరిగిన ఈ చర్చలలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీ విలీనంపై చర్చిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కూడా వారు చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు వీరప్ప మొయిలీ, ఎకె ఆంటోనీలతోపాటు పీఆర్పీ నేత సి.రామచంద్రయ్య పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం చిరంజీవి, వీరప్ప మొయిలీ విలేకరులతో మాట్లాడారు.

సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నట్లు చిరంజీవి తెలిపారు. విలీనంలో వ్యక్తిగత ప్రయోజనాలు లేవని ఆయన చెప్పారు. తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అన్నారు. పోలవరానికి జాతీయ హోదా, రైతులకు ప్యాకేజీ విషయంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను సోనియా గాంధీ వద్ద ప్రస్తావించినట్లు తెలిపారు.

ఈ రోజు నుంచి చిరంజీవి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడని వీరప్ప మొయిలీ చెప్పారు. పీఆర్పీ విలీనంతో కాంగ్రెస్ బలం పెరుగుతుందన్నారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఆస్థి అన్నారు.

0 comments:

Post a Comment