చెన్నై: కుటుంబ కథా చిత్రాలతో తెలుగు సినీ అభిమానుల్ని ఆకట్టుకున్న నటి సుజాత చెన్నైలోని స్వగృహంలో కన్నుమూశారు. కొంతకాలంగా సుజాత అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారం. తమిళ, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 300 చిత్రాల్లో పైగా నటించారు. ఆమె నట జీవితంలో ఎక్కువగా కమల్ హసన్‌తో నటించారు. సుజాత 10 డిసెంబర్ 1952 రోజున శ్రీలంకలో జన్నించారు. 2006 సంవత్సరంలో విడుదలైన శ్రీరామదాసు చిత్రంలో సుజాత చివరిసారిగా తెరపై కనిపించింది. గోరింటాకు, ఏడంతస్తుల మేడ, నీకునేను నాకు నువ్వు, విలన్, బాబా, తప్పు చేసి పప్పు కూడు, పెళ్లి, సూరిగాడు, చంటి, సూత్రదారులు, అగ్నిగుండం, అనుబంధం, ఎమ్యెల్యే ఏడుకొండలు, సీతాదేవి, సర్కస్ రాముడు, గుప్పెడు మనసు, ప్రేమతరంగాలు చిత్రాల్లో నటించారు. హిందీ చిత్రం ఏక్ హీ బూల్‌లో కూడా సుజాత నటించారు. తమిళంలో కాదలన్ మీంగల్, అన్నాకిలి, అవల్ ఓరు థోడర్ కథై, ఎర్నాకులం జంక్షన్, వాజుతుత కట్టుకిరెన్ చిత్రాల్లో నటించారు. సుజాత మృతి తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. |
0 comments:
Post a Comment