Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Saturday, April 2, 2011

2011 విశ్వ విజేత భారత్


ముంబై: యావత్ భారతావని కల తీరింది. 28 ఏళ్ల తరువాత తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకుంటూ ధోని సేన ప్రపంచకప్ గెలవడంతో భరతమాత పులకించి పోయింది. 275 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించింన టీమిండియా తన ఖాతాలో 2011 వరల్డ్‌కప్ గెలుచుకుని తన బ్యాటింగ్‌కు తిరుగులేదని ప్రపంచానికి చాటి చెప్పింది. బౌలింగ్ విభాగంలో అత్యంత పటిష్టంగా శ్రీలంకను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించి తన బ్యాటింగ్ పంచ్‌తో ఆకట్టుకుంది.శ్రీలంక -భారత్‌లు తమ బ్యాటింగ్ విన్యాసాలతో ముంబై వాంఖేడ్ స్టేడియం తడిసి ముద్దయ్యినా.. తన సొంత టీమ్ విజయం సాధించడంతో వాంఖేడ్ స్టేడియం ఆనంద పరవళ్లు తొక్కింది.


భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ధోని గ్యాంగ్ ఆదిలో తడబడి.. టీమిండియా అభిమానుల్లో ఒకింత కలవరం రేపింది. ఇన్నింగ్స్ ఆరంభించిన రెండో బంతికే సెహ్వాగ్‌ను మలింగా బలికొనడంతో ఒక్కసారిగా స్టేడియంలో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. గంభీర్-సచిన్‌లు ఇన్నింగ్స్‌ను కుదుటపరిచే సమయంలో సచిన్‌ను 18 పరుగుల వద్ద అదే బౌలర్‌ పెవిలియన్‌కు పంపిచడంతో భారత్ గెలుపుపై సందేహం ఏర్పడింది.

ప్రపంచ బ్యాటింగ్ లైనప్‌లో అత్యంత పటిష్టటంగా ఉన్న భారత్‌ను నిలువరించడం సంగాక్కరా సేనకు భారంగా పరిగణి ంచింది. సచిన్ అవుటయిన అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ-గంభీర్‌లు 83 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్‌కు ఎదులేకుండా పోయింది. కోహ్లీ 34 పరుగులు చేసిన దిల్షాన్ బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరగడంతో.. ఆ స్థానాన్ని ధోని భర్తీ చేశాడు. గంభీర్ 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ కోల్పోగా.. ధోనీ(91) హాఫ్ సెంచరితో తను ఎంతో విలువైన ఆటగాడ్నో మరోసారి రుజవు చేశాడు. లంక బౌలర్లలో మలింగా రెండు వికెట్లు తీయగా, దిల్షాన్, పెరీరాలు తలో వికెట్టు సాధించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకేయులు జయవర్ధనే సహకారంతో 274 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు విసిరింది.

0 comments:

Post a Comment