Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Friday, March 11, 2011

BEST SPEECH BY NCB

జగన్ పార్టీ ప్రకటనతో రాష్ట్రమంతటా సంబరాలు

హైదరాబాద్: యువనేత, మాజీ ఎంపి వైఎస్ జగన్మోహన రెడ్డి పార్టీ పేరుని ప్రకటించడంతో రాష్ట్రమంతటా కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ఈరోజు జగన్ 'వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ'ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్రమంతటా పండుగ వాతావరణ నెలకొంది. అభిమానులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు సంబరాలు జరుపుకుంటున్నారు.
ఆనందంతో మిఠాయిలు పంచుకుంటున్నారు. బాణాసంచా కాల్చి ఆనందం పంచుకుంటున్నారు.

అనంతపురంలో అభిమానులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. అంతా సందడి వాతావరణం నెలకొంది. జగన్ జిందాబాద్, కాబోయే ముఖ్యమంత్రి జగన్ అంటూ నినాదాలు చేశారు.

జగన్'ని ముఖ్యమంత్రిని చేసి తీరుతామని గుంటూరులో యువకులు శపథం చేశారు. ప్రజలలో నుంచి ఉద్బవించిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని తూర్పుగోదావరి జిల్లాలో యువకులు అన్నారు.

వైఎస్ఆర్ జిల్లా కడపలో మాజీ మేయర్ రవీంద్రనాధ్ రెడ్డి సమక్షంతో అభిమానులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్: జగన్

జగ్గంపేట: యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పేరును ప్రకటించారు. తన పార్టీకి ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’గా నామకరణం చేస్తున్నట్లు జగ్గంపేట బహిరంగ సభలో వెల్లడించారు. రేపు మధ్యాహ్నం 2.29 నిమిషాలకు ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత ప్లీనరీ నిర్వహించి పార్టీ విధివిధానాలు వెల్లడిస్తామని చెప్పారు.

జగన్ ప్రసంగం పూర్తిపాఠం:
నాతో పాటు అడుగులో అడుగు వేయడానికి, నాతో పాటు కలిసి పోరాటం చేయడానికి ఇవాళ ఇక్కడ జతకలిసిన జ్యోతుల నెహ్రూ, వాసిరెడ్డి పద్మ, దొరబాబుతో పాటు సభకు విచ్చేసిన సోదరీ సోదరీమణులందరికీ నా ధన్యవాదాలు. మీ ప్రేమాభిమానాలకు శిరస్సు వంచి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవ్వాళ ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే, ఇంతవరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి- పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదట కండువా వేసింది జ్యోతుల నెహ్రూకే. తర్వాత దొరబాబు, పద్మ గారికి. ఈ రోజుకి ఇంకో ప్రత్యేకత కూడా వుంది. ఇప్పుడే ఆ విషయం కూడా చెప్పాలనిపిస్తోంది. రేపు మధ్యాహ్నం 2.29 నిమిషాలకు ఇడుపుల పాయలో దివంగత నేత, ప్రియతమ నేత వైఎస్సార్ పాదాల చెంత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మూడు రంగుల జెండా నేను, నా తల్లి విజయలక్ష్మి గారు ఆవిష్కరిస్తాం. జిల్లాలో ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి జెండా ఆవిష్కరణ ఇప్పుడు మామూలుగా నిర్వహిస్తాం. ఎన్నికలు ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాలు నిర్వహిస్తాం. అప్పుడే విధివిధానాలు ప్రకటిస్తాం. ఎలక్షన్ అయినపోయిన తర్వాత, గొప్పగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం, రాజశేఖర్ రెడ్డి పాదాల చెంత. ఇవ్వాళ వైఎస్సార్ పాదాల చెంత స్థాపించబోయే పార్టీ ఎలా వుంటుందీ అని ప్రజానీకమంతా ఎదురు చూస్తోంది. ఒక్క మాట చెబుతా. ప్రతీ పేదవాడి మొహంలో చిరునవ్వుని చూసే పార్టీ అవుతుందని చెబుతున్నాను. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్లీనరీ నిర్వహించి రెండు రోజుల మేథోమథనం జరిపి, ప్రతీ పేదవాడి మొహంలో చిరునవ్వులు విరిసే విధంగా మూడో రోజున విధివిధానాలు ప్రజల సమక్షంలో ప్రకటిస్తాం. మీ ప్రేమాప్యాయతలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

Wednesday, March 2, 2011

Allu arjun marriage








THANKS TO SAKSHITV
  


ALLU VARI PELLI SANDHADI







ALL THE BEST BUNNY APTRUTH WISHES U A HAPPY MARRIED LIFE