Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Friday, March 11, 2011

పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్: జగన్

జగ్గంపేట: యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పేరును ప్రకటించారు. తన పార్టీకి ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’గా నామకరణం చేస్తున్నట్లు జగ్గంపేట బహిరంగ సభలో వెల్లడించారు. రేపు మధ్యాహ్నం 2.29 నిమిషాలకు ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత ప్లీనరీ నిర్వహించి పార్టీ విధివిధానాలు వెల్లడిస్తామని చెప్పారు.

జగన్ ప్రసంగం పూర్తిపాఠం:
నాతో పాటు అడుగులో అడుగు వేయడానికి, నాతో పాటు కలిసి పోరాటం చేయడానికి ఇవాళ ఇక్కడ జతకలిసిన జ్యోతుల నెహ్రూ, వాసిరెడ్డి పద్మ, దొరబాబుతో పాటు సభకు విచ్చేసిన సోదరీ సోదరీమణులందరికీ నా ధన్యవాదాలు. మీ ప్రేమాభిమానాలకు శిరస్సు వంచి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవ్వాళ ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే, ఇంతవరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి- పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదట కండువా వేసింది జ్యోతుల నెహ్రూకే. తర్వాత దొరబాబు, పద్మ గారికి. ఈ రోజుకి ఇంకో ప్రత్యేకత కూడా వుంది. ఇప్పుడే ఆ విషయం కూడా చెప్పాలనిపిస్తోంది. రేపు మధ్యాహ్నం 2.29 నిమిషాలకు ఇడుపుల పాయలో దివంగత నేత, ప్రియతమ నేత వైఎస్సార్ పాదాల చెంత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మూడు రంగుల జెండా నేను, నా తల్లి విజయలక్ష్మి గారు ఆవిష్కరిస్తాం. జిల్లాలో ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి జెండా ఆవిష్కరణ ఇప్పుడు మామూలుగా నిర్వహిస్తాం. ఎన్నికలు ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాలు నిర్వహిస్తాం. అప్పుడే విధివిధానాలు ప్రకటిస్తాం. ఎలక్షన్ అయినపోయిన తర్వాత, గొప్పగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం, రాజశేఖర్ రెడ్డి పాదాల చెంత. ఇవ్వాళ వైఎస్సార్ పాదాల చెంత స్థాపించబోయే పార్టీ ఎలా వుంటుందీ అని ప్రజానీకమంతా ఎదురు చూస్తోంది. ఒక్క మాట చెబుతా. ప్రతీ పేదవాడి మొహంలో చిరునవ్వుని చూసే పార్టీ అవుతుందని చెబుతున్నాను. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్లీనరీ నిర్వహించి రెండు రోజుల మేథోమథనం జరిపి, ప్రతీ పేదవాడి మొహంలో చిరునవ్వులు విరిసే విధంగా మూడో రోజున విధివిధానాలు ప్రజల సమక్షంలో ప్రకటిస్తాం. మీ ప్రేమాప్యాయతలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

0 comments:

Post a Comment