Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Thursday, October 14, 2010

ఆ ఇద్దరిపై అంత ప్రేమెందుకు: రోశయ్యకు అధినేత్రి ప్రశ్న!


కాంగ్రెస్ పార్టీ సీనియర్లుగా ఉంటూ వైఎస్ క్యాబినెట్‌లో మంత్రిపదవులు దక్కని కె.జానారెడ్డి, జె.సి.దివాకర్ రెడ్డిలపై ముఖ్యమంత్రి కె.రోశయ్య చూపిస్తున్న అతిప్రేమను కాంగ్రెస్ అధిష్టానం ప్రశ్నించినట్టు సమాచారం. వారిద్దరిపై ఎందుకు అంత ప్రేమను చూపిస్తున్నారు. వారికి మంత్రిపదవులు కట్టబెట్టినంత మాత్రాన పార్టీకి వచ్చే అదనపు బలమేమీ లేదు కదా అంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రశ్నించారు. దీంతో ఖంగుతిన్న రోశయ్య మారుమాట్లాడకుండా మంత్రవర్గ విస్తరణ ఊసెత్తలేదుపైపెచ్చు... మంత్రివర్గ విస్తరణ పేరుతో వీరికి చోటు కల్పిస్తే.. వైఎస్ వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నామనే సంకేతాలు ప్రజలకు వెళతాయన్నారు. అంతేకాకుండా, మంత్రి పదువులు అతి తక్కువ సంఖ్యలో ఉన్నాయనీ, కానీ, వీటికి ఆశిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉందని ఇలాంటి పరిస్థితుల్లో మంత్రివర్గాన్ని విస్తరించి అసమ్మతి పెంచుకోవడం ఎందుకని కాంగ్రెస్ అధిష్టానం సూచించింది.ప్రధానంగా ఒకరిద్దరి కోసం విస్తరణ చేపడితే లేనిపోని సమస్యలు తలెత్తుతాయని సోనియా వ్యాఖ్యానించినట్టు సమాచారం. విస్తరణ అంటూ జరిగితే.. ఎంత లేదన్నా 40 నుంచి 50 మంది వరకూ ఆశావహులు క్యూలో ఉన్నారని పేర్కొంది. కేవలం జానారెడ్డి, జేసీ దివాకరరెడ్డి తదితరులను మంత్రివర్గంలోకి తీసుకోవడానికే విస్తరణ అయితే... మిగిలినవారందరినీ సమాధానపర్చాల్సి ఉంటుంది.
ఇది లేనిపోని సమస్యలకు దారి తీస్తుందని ఢిల్లీ పెద్దలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ కంపను అనవసరంగా కదపడం వల్ల ఉపయోగం కంటే చికాకులే పెరుగుతాయని ఏఐసీసీ పెద్దలు భావిస్తున్నారని సమాచారం. ఈ విషయాలనే ఇటీవల ఢిల్లీ వెళ్లిన రోశయ్యకు నచ్చజెప్పి.. పంపించారని చెబుతున్నారు.అంతగా అయితే మరీ ఇబ్బంది పెడుతున్న మంత్రులను కేబినెట్ నుంచి తప్పిస్తే సరిపోతుందనేది అధిష్టానం సలహా ఇచ్చినట్లు సమాచారం. పైపెచ్చు... విస్తరణపై రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ విముఖత వ్యక్తం చేశారని తెలిసింది. జానా, జేసీ వంటి నేతలను మంత్రివర్గంలోకి తీసుకోవడం వైఎస్ వ్యతిరేకులను ప్రోత్సహించినట్లు అవుతుందని మొయిలీ పేర్కొంటున్నారని తెలుస్తోంది

0 comments:

Post a Comment