Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Monday, February 6, 2012

మణప్పురం డిపాజిట్ల సేకరణపై నిషేధం


ముంబయి : బంగారంపై రుణాలిచ్చే మణప్పురం ఫైనాన్స్‌ చిక్కుల్లో పడింది. కంపెనీ షేరు ధర భారీగా పతనమవుతోంది. నిన్న 4 శాతం పడిన షేరు ధర ఈరోజు 13 శాతం పడిపోతూ 50 రూపాయలకు సమీపంలో ట్రేడవుతోంది. ఈ కంపెనీ.. ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించడంపై రిజర్వ్‌ బ్యాంకు నిషేధం పెట్టింది. దాంతో ఇన్వెస్టర్లు మణప్పురం షేరును అమ్ముతున్నారు. 

మణప్పురంతో పాటు ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌కు చెందిన ప్రొప్రెయిటరీ సంస్థ మాగ్రో కూడా పబ్లిక్‌ నుంచి డిపాజిట్లు సేకరించడానికి వీలు లేదంటూ ఆర్ బీఐ ఆదేశాలు జారీ చేసింది. మణప్పురంలో డిపాజిట్లు చేయొద్దని ప్రజలకు కూడా రిజర్వ్‌ బ్యాంకు సూచించింది. జనవరిలో పబ్లిక్‌ నుంచి రూ.1000 కోట్ల రూపాయల డిపాజిట్లను మణప్పురం సేకరించింది.

సాంకేతిక పొరపాట్ల వల్ల ఆర్ బీఐ ఆదేశాలు జారీ చేసిందని.. వాటిని పాటిస్తామని కంపెనీ మేనేజ్‌మెంట్‌ తెలిపింది. ఆర్ బీఐ విధించిన నిషేధం కేవలం డిపాజిట్ల సేకరణకు మాత్రమే వర్తిస్తుంది. బంగారం తనఖా పెట్టి రుణాలు తెచ్చుకోవడానికి, తెచ్చుకున్న వారికి గానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు.