Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Friday, August 19, 2011

Dookudu Latest Wallpapers {HQ}



















Dookudu PRESS RELEASE


SS

Thursday, June 16, 2011

చీకట్లో చందమామ, శతాబ్దిలోనే సుదీర్ఘ చంద్రగ్రహణం

నిండు పున్నమి చంద్రుడు చీకట్లో చిక్కుకున్నాడు. భూమి నీడ చంద్రుణ్ణి పూర్తిగా కప్పేసింది. శతాబ్దిలోనే అత్యంత సుదీర్ఘ చంద్రగ్రహణాన్ని బుధవారం దేశవ్యాప్తంగా జనం తిలకించారు. ధవళకాంతులు వెదజల్లే చంద్రుడు, గ్రహణం ప్రారంభమవుతున్న సమయంలో ఎరబ్రడ్డాడు. క్రమక్రమంగా క్షీణిస్తూ చీకటి చాటున పూర్తిగా అదృశ్యమయ్యాడు. చంద్రుడు పూర్తిగా చీకట్లో చిక్కుకుని ఉన్న సమయం వంద నిమిషాలు.

దశాబ్ది కిందట 2000 జూలైలో ఇంతకంటే ఎక్కువసేపు సంపూర్ణ గ్రహణం నిలిచింది. మళ్లీ ఇలాంటి గ్రహణం 2141 సంవత్సరంలో మాత్రమే సంభవించనుంది. చంద్రగ్రహణం బుధవారం రాత్రి భారతీయ కాలమానం ప్రకారం 11.54.34 గంటలకు ప్రారంభమైంది. వేకువ జామున 4.30.45 గంటలకు గ్రహణం పూర్తిగా తొలగింది. అర్ధరాత్రి 12.52.30 గంటల నుంచి వేకువ జామున 2.32.54 గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించింది.

అంటే, దాదాపు వంద నిమిషాలు చంద్రుడు పూర్తిగా చీకట్లోనే చిక్కుకున్నట్లు ఢిల్లీలోని నెహ్రూ ప్లానెటోరియం డెరైక్టర్ ఎన్.రత్నశ్రీ చెప్పారు. సూర్యునికి, చంద్రునికి మధ్యకు భూమి రావడంతో ఈ గ్రహణం ఏర్పడింది. ఆఫ్రికా, మధ్య ఆసియా, పశ్చిమాసియా, పశ్చిమ ఆస్ట్రేలియా, తూర్పు బ్రెజిల్, ఉరుగ్వే, అర్జెంటీనా ప్రాంతాల వారు సైతం ఈ గ్రహణాన్ని పూర్తిగా తిలకించగలిగారు.

Tuesday, May 3, 2011

పోసాని కృష్ణ మురళి తో ఫేస్ టూ ఫేస్


పీఆర్పీకి పోసాని గుడ్‌బై

సినీ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి ప్రజారాజ్యం పార్టీకి మంగళవారం రాజీనామా చేశారు. యువనేత వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు పోసాని ప్రకటించారు.

POSANI IN YSR CONGRESS

Monday, May 2, 2011

Killing Osama: Was Pak in on it?

Osama Bin Laden Dead Body

HOW THE WORLD KNEW OSAMA BIN

Obama announces, Al Qaeda leader Osama bin Laden is dead

US president Barack Obama on Monday announced that, Al Qaeda leader, Osama bin Laden is dead.  the master mind behind 11 Sep 2001 attacks on WTC is finally dead and they have his body.

Wednesday, April 20, 2011

ntr wedding card








Saturday, April 9, 2011

NENU NA RAKSHASHI TRILER

Wednesday, April 6, 2011

బహుభాషానటి సుజాత కన్నుమూత


చెన్నై: కుటుంబ కథా చిత్రాలతో తెలుగు సినీ అభిమానుల్ని ఆకట్టుకున్న నటి సుజాత చెన్నైలోని స్వగృహంలో కన్నుమూశారు. కొంతకాలంగా సుజాత అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారం. తమిళ, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 300 చిత్రాల్లో పైగా నటించారు. ఆమె నట జీవితంలో ఎక్కువగా కమల్ హసన్‌తో నటించారు. సుజాత 10 డిసెంబర్ 1952 రోజున శ్రీలంకలో జన్నించారు. 2006 సంవత్సరంలో విడుదలైన శ్రీరామదాసు చిత్రంలో సుజాత చివరిసారిగా తెరపై కనిపించింది. గోరింటాకు, ఏడంతస్తుల మేడ, నీకునేను నాకు నువ్వు, విలన్, బాబా, తప్పు చేసి పప్పు కూడు, పెళ్లి, సూరిగాడు, చంటి, సూత్రదారులు, అగ్నిగుండం, అనుబంధం, ఎమ్యెల్యే ఏడుకొండలు, సీతాదేవి, సర్కస్ రాముడు, గుప్పెడు మనసు, ప్రేమతరంగాలు చిత్రాల్లో నటించారు. హిందీ చిత్రం ఏక్ హీ బూల్‌లో కూడా సుజాత నటించారు. తమిళంలో కాదలన్ మీంగల్, అన్నాకిలి, అవల్ ఓరు థోడర్ కథై, ఎర్నాకులం జంక్షన్, వాజుతుత కట్టుకిరెన్ చిత్రాల్లో నటించారు. సుజాత మృతి తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Monday, April 4, 2011

Badrinath wall papers !!








Click on the above thumbnail for larger size

Sunday, April 3, 2011

ఫైనల్ మ్యాచ్‌కు రికార్డు స్థాయి వీక్షకులు

న్యూఢిల్లీ: భారత, శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో క్రికెట్ అభిమానులు వీక్షించారు. 67.6 మిలియన్ వీక్షకులు ఈ మ్యాచ్‌ను చూడటానికి టెలివిజన్ సెట్లకు అత్తుకుపోయారు. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ రేటింగ్ అని ఆడియన్స్ మెజర్‌మెంట్ అండ్ అనలిటికల్ లిమిటెడ్ తెలిపింది. ఫైనల్ మ్యాచ్‌కు 13.7 పాయింట్ల రేటింగ్‌ను నమోదు చేసుకుంది. ఓ దశలో రేటింగ్ 21.44 పాయింట్లకు చేరుకుందని ఆ సంస్థ వెల్లడించింది. ఇప్పటి వరకు అత్యధికంగా చూసిన మ్యాచ్‌గా రికార్డును సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌ను చూసిన వారిలో అత్యధికంగా 64 శాతం మంది ఇంటి వద్ద నుంచే చూసినట్టు గణాంకాలు వెల్లడించాయి.
source:sakshi

180 Teasers &trilers


Saturday, April 2, 2011

2011 విశ్వ విజేత భారత్


ముంబై: యావత్ భారతావని కల తీరింది. 28 ఏళ్ల తరువాత తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకుంటూ ధోని సేన ప్రపంచకప్ గెలవడంతో భరతమాత పులకించి పోయింది. 275 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించింన టీమిండియా తన ఖాతాలో 2011 వరల్డ్‌కప్ గెలుచుకుని తన బ్యాటింగ్‌కు తిరుగులేదని ప్రపంచానికి చాటి చెప్పింది. బౌలింగ్ విభాగంలో అత్యంత పటిష్టంగా శ్రీలంకను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించి తన బ్యాటింగ్ పంచ్‌తో ఆకట్టుకుంది.శ్రీలంక -భారత్‌లు తమ బ్యాటింగ్ విన్యాసాలతో ముంబై వాంఖేడ్ స్టేడియం తడిసి ముద్దయ్యినా.. తన సొంత టీమ్ విజయం సాధించడంతో వాంఖేడ్ స్టేడియం ఆనంద పరవళ్లు తొక్కింది.


భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ధోని గ్యాంగ్ ఆదిలో తడబడి.. టీమిండియా అభిమానుల్లో ఒకింత కలవరం రేపింది. ఇన్నింగ్స్ ఆరంభించిన రెండో బంతికే సెహ్వాగ్‌ను మలింగా బలికొనడంతో ఒక్కసారిగా స్టేడియంలో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. గంభీర్-సచిన్‌లు ఇన్నింగ్స్‌ను కుదుటపరిచే సమయంలో సచిన్‌ను 18 పరుగుల వద్ద అదే బౌలర్‌ పెవిలియన్‌కు పంపిచడంతో భారత్ గెలుపుపై సందేహం ఏర్పడింది.

ప్రపంచ బ్యాటింగ్ లైనప్‌లో అత్యంత పటిష్టటంగా ఉన్న భారత్‌ను నిలువరించడం సంగాక్కరా సేనకు భారంగా పరిగణి ంచింది. సచిన్ అవుటయిన అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ-గంభీర్‌లు 83 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్‌కు ఎదులేకుండా పోయింది. కోహ్లీ 34 పరుగులు చేసిన దిల్షాన్ బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరగడంతో.. ఆ స్థానాన్ని ధోని భర్తీ చేశాడు. గంభీర్ 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ కోల్పోగా.. ధోనీ(91) హాఫ్ సెంచరితో తను ఎంతో విలువైన ఆటగాడ్నో మరోసారి రుజవు చేశాడు. లంక బౌలర్లలో మలింగా రెండు వికెట్లు తీయగా, దిల్షాన్, పెరీరాలు తలో వికెట్టు సాధించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకేయులు జయవర్ధనే సహకారంతో 274 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు విసిరింది.

Friday, March 11, 2011

BEST SPEECH BY NCB

జగన్ పార్టీ ప్రకటనతో రాష్ట్రమంతటా సంబరాలు

హైదరాబాద్: యువనేత, మాజీ ఎంపి వైఎస్ జగన్మోహన రెడ్డి పార్టీ పేరుని ప్రకటించడంతో రాష్ట్రమంతటా కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ఈరోజు జగన్ 'వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ'ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్రమంతటా పండుగ వాతావరణ నెలకొంది. అభిమానులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు సంబరాలు జరుపుకుంటున్నారు.
ఆనందంతో మిఠాయిలు పంచుకుంటున్నారు. బాణాసంచా కాల్చి ఆనందం పంచుకుంటున్నారు.

అనంతపురంలో అభిమానులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. అంతా సందడి వాతావరణం నెలకొంది. జగన్ జిందాబాద్, కాబోయే ముఖ్యమంత్రి జగన్ అంటూ నినాదాలు చేశారు.

జగన్'ని ముఖ్యమంత్రిని చేసి తీరుతామని గుంటూరులో యువకులు శపథం చేశారు. ప్రజలలో నుంచి ఉద్బవించిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని తూర్పుగోదావరి జిల్లాలో యువకులు అన్నారు.

వైఎస్ఆర్ జిల్లా కడపలో మాజీ మేయర్ రవీంద్రనాధ్ రెడ్డి సమక్షంతో అభిమానులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్: జగన్

జగ్గంపేట: యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పేరును ప్రకటించారు. తన పార్టీకి ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’గా నామకరణం చేస్తున్నట్లు జగ్గంపేట బహిరంగ సభలో వెల్లడించారు. రేపు మధ్యాహ్నం 2.29 నిమిషాలకు ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత ప్లీనరీ నిర్వహించి పార్టీ విధివిధానాలు వెల్లడిస్తామని చెప్పారు.

జగన్ ప్రసంగం పూర్తిపాఠం:
నాతో పాటు అడుగులో అడుగు వేయడానికి, నాతో పాటు కలిసి పోరాటం చేయడానికి ఇవాళ ఇక్కడ జతకలిసిన జ్యోతుల నెహ్రూ, వాసిరెడ్డి పద్మ, దొరబాబుతో పాటు సభకు విచ్చేసిన సోదరీ సోదరీమణులందరికీ నా ధన్యవాదాలు. మీ ప్రేమాభిమానాలకు శిరస్సు వంచి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవ్వాళ ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే, ఇంతవరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి- పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదట కండువా వేసింది జ్యోతుల నెహ్రూకే. తర్వాత దొరబాబు, పద్మ గారికి. ఈ రోజుకి ఇంకో ప్రత్యేకత కూడా వుంది. ఇప్పుడే ఆ విషయం కూడా చెప్పాలనిపిస్తోంది. రేపు మధ్యాహ్నం 2.29 నిమిషాలకు ఇడుపుల పాయలో దివంగత నేత, ప్రియతమ నేత వైఎస్సార్ పాదాల చెంత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మూడు రంగుల జెండా నేను, నా తల్లి విజయలక్ష్మి గారు ఆవిష్కరిస్తాం. జిల్లాలో ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి జెండా ఆవిష్కరణ ఇప్పుడు మామూలుగా నిర్వహిస్తాం. ఎన్నికలు ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాలు నిర్వహిస్తాం. అప్పుడే విధివిధానాలు ప్రకటిస్తాం. ఎలక్షన్ అయినపోయిన తర్వాత, గొప్పగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం, రాజశేఖర్ రెడ్డి పాదాల చెంత. ఇవ్వాళ వైఎస్సార్ పాదాల చెంత స్థాపించబోయే పార్టీ ఎలా వుంటుందీ అని ప్రజానీకమంతా ఎదురు చూస్తోంది. ఒక్క మాట చెబుతా. ప్రతీ పేదవాడి మొహంలో చిరునవ్వుని చూసే పార్టీ అవుతుందని చెబుతున్నాను. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్లీనరీ నిర్వహించి రెండు రోజుల మేథోమథనం జరిపి, ప్రతీ పేదవాడి మొహంలో చిరునవ్వులు విరిసే విధంగా మూడో రోజున విధివిధానాలు ప్రజల సమక్షంలో ప్రకటిస్తాం. మీ ప్రేమాప్యాయతలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

Wednesday, March 2, 2011

Allu arjun marriage








THANKS TO SAKSHITV
  


ALLU VARI PELLI SANDHADI







ALL THE BEST BUNNY APTRUTH WISHES U A HAPPY MARRIED LIFE

Monday, February 28, 2011

Allu Arjun Wedding Invitation FOR FANS


Friday, February 25, 2011

మన TV9 మేరుగు అయ్యిన సమాజం కోసం పని చేస్తోందా ????

మన TV9 మేరుగు అయ్యిన సమాజం కోసం పని చేస్తోందా ?రేటింగ్  కోసం పని చేస్తోందా? జర్నలిజం గురించి వాటి విలవల గురించి హక్కుల గురించి  మాటలు ఆడే TV9 వాటి విలువలు పాటిస్తోందా  ఒక అప్పుడు TV9 అంటే జనాలు ఇష్టపడే వారు ?కానీ ఇప్పుడు  ప్రజలు ఏమంటున్నారు  TV9 గురించి  ప్రజల స్పందన ఏమిటి http://amplicate.com/hate/tv9
TV9 ని అభినందించే వారు ఇష్ట పడేవారికీ  కూడా ఈ మధ్య ఆ ఛానల్ పట్ల ఆసేక్తి తగ్గింది దానికి కారణం ఆ ఛానల్ అనవసరం మయిన చర్చలు పెట్టడం వల్ల .
TV9 బాధ్యత గా వుందా ? మనం ఒకరికి సహాయం చేసేటప్పుడు మన పేరు కన్నా సహాయం ముఖ్యం అని ఆలోచన చేయాలి ముఖ్యం గా వరదలు వచినప్పుడు మన బ్రాండ్ నేమ్ ప్రోమోట్ చేయడం ముఖ్యం కాదు 
ఎవరో హీరో కూతురు పెళ్లి చేసుకుటే ఆ పెళ్లి గురించి ఆ రోజు అంత మనం ఆ ప్రోగ్రాం వేసి ఆ ఇంట్లో వాళ్ళ పరువును దిగజార్చడం జర్నలిజం ఆ ??? వర్మ జీవితం గురించి  వర్మ రక్తచరిత్ర సినిమా గురించి ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మనం CRIMEWATCH ప్రోగ్రాం చేయకూడదు కల్పిత పాత్రలు అని రాసి మరి చూపిస్తాం ఇది సమాజానికి అవసరమా ? ఇలాంటి కార్యక్రమాలు చూసి తప్పుచేసిన వాళ్ళు ఎలా తప్పించు కోవాలోతెలుసు కుంటున్నారు ఒక వ్యక్తి మరణిస్తే EXCLUSIVE FIRSTON TV9 అని వస్తుంది ఒకరి విషాదం ఒకరి బాధ ను మనం ఆ విధం గా చూపించ వచ్చునా ఇది ఏ రకమయిన జర్నలిజం రాంగోపాల్ వర్మ సినిమాల గురించి రాంగోపాల్ వర్మ  గురించి గంటల గంటలు చర్చలు అవసరమా  TV9 వచ్చిన కొత్త లో తప్పు చేయాలి అంటే భయం కానీ ఇప్పుడు డబ్బ్లు ఇస్తే న్యూస్ చూపించరు అనే విధం గా తాయారు అయ్యింది 














ఇలాంటి కార్యక్రమలు చూపించడమే మెరుగైన సమాజమా

Tuesday, February 22, 2011

2011-12 వార్షిక బడ్జెట్ రూ.1,28,542 కోట్లు


రాష్ట్ర ప్రభుత్వం 2011-12 సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళిక బడ్జెట్‌కు రూ.1,28,542 కోట్లు కేటాయించింది. బడ్జెట్ కేటాయింపుల వివరాలు :

బడ్జెట్ వార్షిక ప్రణాళిక - రూ.1,28,542 కోట్లు
ప్రణాళిక వ్యయం - రూ.47,558 కోట్లు
ప్రణాళికేతర కేటాయింపులు - రూ.80,984 కోట్లు
రెవెన్యూ మిగులు అంచనా - రూ.3,826 కోట్లు
ద్రవ్యలోటు అంచనా రూ. 17,602 కోట్లు
జీడీపీ అంచనా 8.5 శాతం
పరిశ్రమల వృద్ధి 9,.61 శాతంగా అంచనా

సాగునీటి రంగానికి - రూ.15వేల కోట్లు
జలయజ్ఞం రూ.15,010 కోట్లు
ఉన్నతవిద్య - రూ.3,337 కోట్లు
ఆరోగ్యం - రూ.5,040 కోట్లు
సాంఘిక సంక్షేమం -రూ.2,352 కోట్లు
బీసీ సంక్షేమం - రూ. 2,104 కోట్లు
మైనార్టీ సంక్షేమం - రూ.3001 కోట్లు
రాయితీ బియ్యం - రూ.2,500 కోట్లు
పరిశ్రమల శాఖ - రూ.858 కోట్లు

సమాచార సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్లు శాఖ రూ. 51 కోట్లు
ప్రాథమిక విద్యకు - రూ. 14, 025 కోట్లు
కార్మిక ఉపాధి - రూ. 489 కోట్లు
రహదారులు, భవనాలు శాఖ రూ. 4,108 కోట్లు
గృహ నిర్మాణం - రూ. 2,300 కోట్లు
మహిళా శిశు సంక్షేమ శాఖ - రూ. 1948 కోట్లు
గ్రామీణాభివృద్ధి - రూ. 3,341 కోట్లు
పట్టణాభివృద్ధి - రూ. 5,080 కోట్లు
సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ - రూ.100 కోట్లు
నియోజకవర్గ అభివృద్ధి కార్యకమం - రూ.385 కోట్లు

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం - రూ.400 కోట్లుతో ప్రత్యేక నిధి
మౌలిక సదుపాయాలు పెట్టుబడులకు రూ.143 కోట్లు
ఇంధన శాఖకు - రూ.4,980 కోట్లు
రెండు రూపాయల బియ్యానికి - రూ. 2,500 కోట్లు
ఆర్టీసీకి - రూ.200 కోట్లు
పాడి పరిశ్రమకు - రూ.930 కోట్లు