వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొంతమంది నాయకుల మాటలు విని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని రాష్ట్ర వైద్యశాఖామంత్రి దానం నాగేందర్ హితవు పలికారు. జగన్‌కు రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉన్నదనీ, కానీ కొంతమంది నాయకులు ఆయన చెవెమ్మట జోరీగలా మారి ఆయన భవిష్యత్తును పాడుచేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు.
అధిష్ఠానం మాటలు జగన్ మంచికోసమే తప్ప, ఆయన ఎదుగుదలకు అడ్డుగోడగా నిలిచేవి కావని అభిప్రాయపడ్డారు. కొంతమంది నాయకులు జగన్‌కు అధిష్ఠానానికి మరింత దూరాన్ని పెంచడమే పనిగా పెట్టుకున్నారన్నారు.
వైఎస్సార్ ప్రథమ వర్థంతిని ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నాగేందర్ వెల్లడించారు.

I LOVE MY INDIA

0 comments:
Post a Comment